భరత్ అనే నేనుతో మహేష్ బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాపుల భారీ నుండి బయట పడేసిన దర్శకుడు కొరటాల శివ. అందుకే మీరంతా సూపర్ స్టార్ అని అంటున్నా ఈ సూపర్ స్టార్ కు నాలుగేళ్లలో రెండుసార్లు లైఫ్ ఇచ్చాడు కొరటాల శివ అని అంత ఓపెన్ గా చెప్పేశాడు మహేష్. దర్శకుడికి గౌరవం ఇవ్వడంలో స్టార్స్ ఎప్పుడు ముందుంటారు ఆ విషయంలో మహేష్ మరి కాస్త ఎక్కువ అని చెప్పొచ్చు.


ఇక ఈ సినిమా సక్సెస్ తో ఫుల్ ఖుషిగా ఉన్న మహేష్ కొరటాల శివకు ఓ క్రేజీ గిఫ్ట్ ఇచ్చాడని తెలుస్తుంది. శ్రీమంతుడు సినిమా టైంలో కూడా ఆడి కారుని కొరటాల శివకు గిఫ్ట్ గా ఇచ్చాడు మహేష్. ఇక ఇప్పుడు మాత్రం అంతకంటే పెద్దది అని అంటున్నారు. అయితే ఆ గిఫ్ట్ ఏంటన్నది మాత్రం ప్రస్తుతానికి సర్ ప్రైజ్ అట.


నగదు రూపంలో ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ సారి మహేష్ దర్శకుడు కొరటాల శివకు ఎలాంటి గిఫ్ట్ ఇచ్చి ఉంటాడా అని ఆరా తీస్తున్నారు ప్రేక్షకులు. ఇక భరత్ అనే నేనుతో మహేష్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమా అంచనాలను అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.


స్టార్ సినిమాలకు మెసేజ్ ను యాడ్ చేసి వాటిని కమర్షియల్ గా కూడా ఆ హీరో ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని హిట్ అయ్యేలా చేయడమే కొరటాల శివ లక్ష్యం. హ్యాట్రిక్ హిట్స్ దాటి భరత్ అనే నేనుతో డబుల్ హ్యాట్రిక్ షురూ చేసిన కొరటాల శివ కచ్చితంగా ఇదే ఫాం కొనసాగిస్తాడని చెప్పొచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: