ఎవడే సుబ్రమణ్యం సినిమాలో రిషి పాత్రలో నటించి మెప్పించిన విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు హిట్ తో హీరోగా రిజిస్టర్ అయ్యాడు. ఇక అర్జున్ రెడ్డి సినిమా తర్వాత అతని క్రేజ్ ఏంటన్నది అందరికి తెలిసిందే. సందీప్ వంగ డైరక్షన్ లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా చిన్న సినిమాల్లో ప్రభంజనాలు సృష్టించింది.


ఇక ఈ సినిమా తర్వాత విజయ్ కు వరుసగా అవకాశాలు రావడం జరిగింది. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్లో పరశురాం డైరక్షన్ లో గీతా గొవిందం సినిమా చేస్తున్నాడు విజయ్. ఇక తను చేసి ట్యాక్సీవాలా కూడా రిలీజ్ కు రెడీ అవుతుంది. మహానటి సినిమాలో కూడా భాగమైన విజయ్ ఆ బ్యానర్లో మరో రెండు సినిమాలకు సైన్ చేశాడని తెలుస్తుంది. 


ఎవడే సుబ్రమణ్యం సినిమా నిర్మించిన స్వప్నా సినిమాస్ బ్యానర్లో స్వప్న దత్ నిర్మాతగా నందిని రెడ్డి డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడట విజయ్. ఇక అదే కాకుండా రాజు డికె డైరక్షన్ లో కూడా ఓ సినిమా ఉంటుందని తెలుస్తుంది. మొత్తానికి అర్జున్ రెడ్డితో అదిరిపోయే హిట్ అందుకున్న విజయ్ క్రేజీ ఆఫర్లను సొంతం చేసుకుంటున్నాడు. 


అయితే ప్రతిది అర్జున్ రెడ్డి అంత సక్సెస్ అవుతుందా అంటే.. విజయ్ కథల ఎంపికలో కొత్తదనం చూపిస్తున్నాడు కాబట్టి ఈ సినిమాలు తప్పకుండా విజయం సాధించే అవకాశం ఉందని అంటున్నారు. రానున్న రోజుల్లో విజయ్ తప్పకుండా స్టార్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: