మొన్న విడుదల అయిన ‘నాపేరు సూర్య’ అనుకున్న విజయాన్ని కలెక్షన్స్ విషయంలో అందుకోకలేక పోవడానికి పరోక్షంగా చరణ్ మహేష్ లు కారకులు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.   వాస్తవానికి ఈ సినిమాకు మొదటిరోజు తెలుగు రాష్ట్రాలలో 16 కోట్ల రూపాయల కలక్షన్స్ షేర్ వచ్చినా అదేవిధంగా ఓవర్సీస్ లో హాఫ్ మిలియన్ డాలర్స్ కలక్షన్స్ అందుకుని అల్లు అర్జున్ సినిమాలలో సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా మంచి కలక్షన్స్ అందుకున్నా ఈమూవీకి వచ్చిన డివైడ్ టాక్ వైరల్ గా మారడానికి కారణం చరణ్ మహేష్ లు అని అంటున్నారు. 
charan along with mahesh latest photios కోసం చిత్ర ఫలితం
ఈ ఏడాది సమ్మర్ రేస్ ను మొదలుపెడుతూ వచ్చిన ‘రంగస్థలం’ ఆతరువాత రెండు వారాల క్రితం వచ్చిన ‘భరత్ అనే నేను’ రెండు డిఫరెంట్ కథలతో ముందుకు వచ్చి ప్రేక్షకులను తన్మయత్వంలోకి తీసుకువెళ్ళిపోయాయి. అయితే బన్నీ ‘నాపేరు సూర్య’ కథ విషయంలోనే కాదు ముఖ్యంగా ఈమూవీ స్క్రీన్ ప్లే విషయంలో వక్కంతం వంశీ కన్ఫ్యూజ్ కావడంతో ‘సూర్య’ సినిమాను ఇప్పటికే విడుదలైన ‘రంగస్థలం’ ‘భరత్ అనే నేను’ సినిమాల స్థాయితో పోల్చుకుంటూ సాధారణ ప్రేక్షకులు పెదవి విరవడం జరుగుతోంది.
సంబంధిత చిత్రం
దీనికితోడు భారీ ఓపెనింగ్స్ రాబట్టాలి అన్న ఉద్దేశ్యంతో ‘సూర్య’ ను మన తెలుగు రాష్ట్రాలలో భారీ సంఖ్యలో ధియేటర్లలో విడుదల చేయాలని ప్రయత్నించినా ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న ‘రంగస్థలం’ ‘భరత్ అనే నేను’ సినిమాల వల్ల ‘సూర్య’ కు అనుకున్న స్థాయిలో ధియేటర్లు దొరకలేదు అన్న వార్తలు కూడ వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఓవర్సీస్ ప్రేక్షకులు ‘సూర్య’ సినిమా పట్ల పెదవి విరచడంతో ఈమూవీకి ఈవారాంతానికి ఒక మిలియన్ డాలర్లు కూడ రావు అన్న ప్రచారం జరుగుతోంది. 
సంబంధిత చిత్రం
దీనికితోడు ఈమూవీ పై ఉన్న భారీ అంచనాలతో ‘సూర్య’ ను తమిళం మళయాళం భాషలలో డబ్ చేసి విడుదల చేసినా అక్కడ కూడ ‘సూర్యను’ పెద్దగా పట్టించుకోవడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో ఈసమ్మర్ రేస్ కు వచ్చిన అల్లు అర్జున్ చరణ్ మహేష్ ల తరువాత మూడవ స్థానంతో సరిపెట్టుకోవలసిన పరిస్థుతులు ఏర్పడుతున్నాయి. ఏది ఎలా చూసుకున్నా 100 కోట్ల నెట్ కలక్షన్స్ సాధించాలి అని కలలు కంటున్న బన్నీ కలలు ‘సూర్య’ తీర్చలేదు అన్నది మాత్రం వాస్తవం అని అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: