తెలుగు ఇండస్ట్రీలో మెగా, నందమూరి ఫ్యామిలీ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలే హవా కొనసాగిస్తున్నారు.  ఇక ఎన్టీఆర్ టెంపర్ నుంచి జై లవకుశ వరకు వరుస విజయాలు సాధిస్తూ మంచి ఫామ్ లో ఉన్నారు.  ఇక సుకుమార్, రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. 
Image result for ram charan ntr
ఇంకా కలెక్షన్ల సునామీ సృష్టిస్తూనే ఉంది. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి మ్యారేజ్ డే వేడుకల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన ముఖ్య అతిథులయ్యారు. ఈ ఫొటోలను, ఓ చిన్న వీడియోను ఉపాసన తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇండస్ట్రీలో ఈ ఇద్దరు హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత మంచి మిత్రులుగా కొనసాగుతున్నారు. అంతే కాదు ఈ ఇద్దరు హీరోలు త్వరలో రాజమౌళి దర్శకత్వంలో నటించి కనువిందు చేయబోతున్నారు.
Image result for ram charan ntr
ఎన్టీఆర్ తనయుడిని తన ఒళ్లో కూర్చోపెట్టుకున్న ఉపాసన, రామ్ చరణ్ భుజంపై చెయ్యి వేసిన ఎన్టీఆర్ ఉన్న ఫొటో పోస్ట్ అయిన తరువాత మెగా, నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ వారసుడు "ఫాలో ఫాలో యూ..." పాట పాడిన వీడియోనూ ఉపాసన పోస్ట్ చేశారు. ఈ పిక్, వీడియో చూడటానికి రెండు కళ్లూ చాలడం లేదంటున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: