సూపర్ స్టార్ మహెష్ బాబు "భరత్ ₹ 193.63 కోట్ల వసూళ్ళు సాధించి ₹200 కోట్ల రికార్డ్ వైపు భరత్ అనే నేను పరుగులు " విడుదలై రెండువారాలు పూర్తయింది. సినిమా సూపర్ హిట్ అనిపించుకుంది. అందులో సందేహం ఏమాత్రం లేదు. అయితే  'నా పేరు సూర్య' విడుదల భారీగా చేసారు. మల్టిపుల్ సెంటర్లలో థియేటర్లు కుమ్మేసారు. దానికి తోడు షేర్ పడిపోతున్నందున భరత్ అనే నేను సినిమాను ఒక్కో థియేటర్ లో వుంచి మిగిలినవి వదిలేసారు.
bharat ane nenu 2 weeks collection కోసం చిత్ర ఫలితం
కానీ నా పేరు సూర్య విడుదల రోజు ఇలా మల్టిపుల్ సెంటర్లలో భరత్ అనే నేను ఆడే ఆ ఒక్కో థియటర్ హవుస్ ఫుల్ అయ్యాయి. ఇది కేవలం ఒక్క ఆట మాత్రమే కాకుండా మూడు నాలుగు ఆటలు. దాంతో మళ్లీ కొన్ని థియేటర్లు జోడించారు. మల్టిఫుల్ థియేటర్లు వున్న సెంటర్ల లో చాలా చోట్ల మళ్లీ ఒక్కో థియేటర్ జత చేసారు. అయినా కూడా రెండు  థియేటర్స్ ఆదివారం  నాడు హౌజ్ ఫుల్ కావడం విశేషం.
bharat ane nenu 2 weeks collection కోసం చిత్ర ఫలితం
వేసవి సెలవులు, మండే ఎండలు, పిల్లలకోసం వినోదం తప్పనందున థియేటర్లు ఏసి కావడంతో, మాట్నీ, ఫస్ట్ షోలు బాగా హౌజ్ ఫుల్ అయిపోతున్నాయి. సో, భరత్ అనే నేను తిరిగి విజయ పథాన నడుస్తుందన్న మాట. "నా పేరు సూర్య సినిమా" వచ్చిన డివైడ్ టాక్ కూడా భరత్ అనే నేనుకు తిరిగి ప్లస్ అయినట్లు కనిపిస్తోంది. దీనికి తోడు "నా పేరు సూర్య" కు దొరకని విజువల్ మీడియా సపోర్ట్ భరత్ అనే నేను కు బాగా కలిసివచ్చిందనే చెప్పొచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: