ఈవారం విడుదల కాబోతున్న ‘మహానటి’ విషయంలో ఈ సినిమా దర్శక నిర్మాతలు అనుసరిస్తున్న వ్యూహాలు వారి మితిమీరిన ఆత్మ స్థైర్యాన్ని సూచిస్తోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. బయోపిక్  సినిమాలకు టాలీవుడ్ ఇండస్ట్రీ మార్కెట్ లో పెద్దగా మార్కెట్ లేక పోయినా ‘మహానటి’  సావిత్రి జీవితం పై చాలా గట్టి హోమ్ వర్క్ చేసి భారీ బడ్జెట్ తో తీసిన ఈపీరియాడిక్ బయోపిక్ పై ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తి ఉన్నా ఈమూవీకి అనుకున్న స్థాయిలో బిజినెస్ జరగలేదు అన్న వార్తలు వస్తున్నాయి. 
mahanati movie latest photos కోసం చిత్ర ఫలితం
సావిత్రి జీవితం పై దక్షిణాది సినిమా రంగ ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఇప్పటికీ ఉన్న నేపధ్యంలో ఈమూవీ పై నిర్మాతలు సుమారు 27 కోట్ల వరకు ఖర్చు చేసారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈమూవీ పై ఆడియో ఫంక్షన్ తరువాత మంచి క్రేజ్ ఏర్పడినా సరైన రేట్లు బయ్యర్ల నుండి రాకపోవడంతో ఈమూవీని దక్షిణాది అంతా ఈసినిమా నిర్మాతలు వారే సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నారు. 
mahanati movie latest photos కోసం చిత్ర ఫలితం
తెలుస్తున్న సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ఏరియాలలో ఈమూవీని అమ్మడంతో ఈమూవీ పై ఇప్పటి వరకు 8 కోట్ల బిజినెస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈబిజినెస్ అంతా రికరబుల్ కండిషన్ పై జరిగినట్లు వార్తలు హడావిడి చేస్తున్నాయి. దీనికితోడు కీలకమైన నైజాం ఆంధ్ర ఏరియాలలో చాల జిల్లాలకు సంబంధించిన హక్కులు ఈమూవీ నిర్మాతల దగ్గరే ఉండటంతో ఈమూవీ పై అశ్వినీదత్ కుటుంబం భారీ రిస్క్ చేస్తోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
mahanati movie latest photos కోసం చిత్ర ఫలితం
ఈసినిమా శాటిలైట్ హక్కులు కూడ ఇప్పటికీ అమ్మకం కాకపోవడంతో పాటు ఈమూవీ బిజినెస్ సుమారు 75 శాతం వరకు పూర్తి కాని నేపధ్యంలో ఈ మూవీ కంటెంట్ ను నమ్ముకుని ఇప్పటికే అపజయాల బాటలో ఉన్న అశ్వినీదత్ చాల రిస్క్ చేస్తున్నాడు అని అంటున్నారు. ఈమూవీకి అయిన పెట్టుబడిని పరిగణంలోకి తీసుకుంటే ఈమూవీకి ఖచ్చితంగా 40 కోట్ల గ్రాస్ కలక్షన్స్ రావలసిన పరిస్థితి ఉంది. జీవితం అంతా దురదృష్టంతో పోరాటం చేసిన సావిత్రి జీవితాన్ని నమ్ముకుని ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ రాకుండా ఒక దృశ్య కావ్యంగా నిర్మించిన ఈ మూవీ విజయం కావాలని అందరూ కోరుకుంటూ ఉన్నా ఈమూవీ పై బిసి సెంటర్ల ప్రేక్షకులు ఎటువంటి తీర్పు ఇస్తారు అన్న ఆసక్తి రోజురోజుకు పెరిగిపోతోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: