ఇండియన్ సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన ‘బాహుబలి 2’ కు కలక్షన్స్ పరంగా చైనాలో మంచి స్పందన వస్తూ ఉన్నా అక్కడ మీడియా మాత్రం ‘బాహూబలి 2’ ను టార్గెట్ చేస్తూ చాల ఘాటైన కామెంట్స్ ను చేస్తోంది. ముఖ్యంగా అనేక ప్రముఖ చైనా పత్రికలు ‘బాహుబలి 2’ ను విమర్శిస్తూ వ్రాస్తున్న విశ్లేషణలు ఒక విధంగా రాజమౌళికి షాక్ ఇస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.
BAHUBALI2 LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
‘బాహుబలి 2’ చైనా మార్కెట్ పై రాజమౌళికి ముందుగానే సందేహాలు ఏర్పడటంతో జక్కన్న ముందుగా ఈసినిమాను జపాన్ లో విడుదల చేసి అక్కడ ఆమూవీకి హైక్ తీసుకు రావడానికి జపాన్ వెళ్ళి రాజమౌళి స్వయంగా ప్రమోట్ చేసిన తరువాత ఈమూవీకి జపాన్ లో మంచి స్పందన రావడంతో ఆధైర్యంతో రాజమౌళి ఈసినిమాను చైనాలో అత్యంత భారీ స్థాయిలో విడుదల చేసాడు. అయితే ఈసినిమాకు చైనాలో తొలిరోజున 2.5 మిలియన్ డాలర్ల కలక్షన్స్ వచ్చాయని ఇండియా మీడియాలో జరుగుతున్న ప్రచారం పై చైనా మీడియా సెటైర్లు వేస్తోంది. 
సంబంధిత చిత్రం
ఇండియాకు సంబంధించి ఒక చిన్న హిందీ సినిమా కూడ చైనా మార్కెట్ లో 3.42 మిలియన్ డాలర్లు వస్తున్న నేపధ్యంలో ‘బాహుబలి 2’ లాంటి భారీ సినిమాకు ఇలాంటి చిన్న కలక్షన్స్ ఏమిటి అని సెటైర్లు వేస్తోంది చైనా మీడియా. అంతేకాదు ఈమూవీ అంతా గ్రాఫికల్ మాయ మాత్రమే అంటూ చైనా పత్రికలు ‘బాహుబలి 2’ పై నెగిటివ్ రివ్యూస్ వ్రాస్తున్నాయి. దీనితో ‘బాహుబలి 2’ చైనా ప్రేక్షకులకు నిజంగా నచ్చలేదా ? లేకుంటే ఇది అంతా చైనా మీడియా ‘బాహుబలి 2’ పై చేస్తున్న కుట్ర అనుకోవాలా అన్న విషయమై చర్చలు జరుగుతున్నాయి. 
BAHUBALI2 LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇది ఇలా ఉండగ ‘బాహుబలి’ ప్రీక్వెల్ తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనిలో శివగామి చిన్నతనం మాహిష్మతికి కోడలు కావడం కట్టప్ప ఎక్కడివాడు? ఎందుకు రాజ్యానికి బానిస అయ్యాడు? అనే అంశాలు ఇందులో ఉంటాయట. అయితే బాహుబలి ప్రీక్వెల్ సినిమా రూపంలో కాకుండా ఆన్ లైన్ సిరీస్ రూపంలో తెచ్చేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వచ్చే ఆగష్టు నుండి కొత్త నటులతో భారీ సెట్స్ మధ్య ఈ ఆన్ లైన్ సిరీస్ షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. అయితే ఈ ఆన్ లైన్ సిరీస్ కు ఎవరు దర్శకులు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్..  



మరింత సమాచారం తెలుసుకోండి: