తెలుగు తెరపై మొదటి సారిగా సినీ తారలపై బయోపిక్ సినిమాలు వెంట వెంటనే వస్తున్నాయి. ఎవడే సుబ్రమణ్యం ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘మహానటి. ఈ మూవీ ఈ నెల 9వ తేదిన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.. సావిత్రిగా కీర్తి సురేష్ ఒదిగిపోయింది.  ఆమె భర్త జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో విలేఖరిగా  సమంత అక్కినేని ఆమె స్నేహితుడిగా విజయ్ దేవరకొండ కీలక పాత్రలు పోషించారు. 
Image result for సుశీల పాత్రలో షాలిని పాండే
ఈ సినిమాపై ప్రతిరోజూ క్యారెక్టర్స్ కి సంబంధించి ఒక్కో వీడియో రిలీజ్ చేస్తున్నారు.  ఇప్పటికే అవసరాల శ్రీనివాస్, క్రిష్, మోహన్ బాబు కి సంబంధించిన వీడియోలు రిలీజ్ చేశారు. తాజాగా ఇక ఈ మూవీలో సావిత్రి స్నేహితురాలు సుశీల‌ ఈ పాత్ర ను ప‌రిచ‌యం చేస్తూ నానీ వాయిస్ ఓవ‌ర్ తో మ‌హాన‌టి చిత్ర యూనిట్ ఒక వీడియోను విడుదల చేసింది.. ఆ పాత్ర‌ను షాలిని పాండే పోషించింది.
Image result for సుశీల పాత్రలో షాలిని పాండే
ఇక ఈ మూవీలో సావిత్రి స్నేహితురాలు సుశీల‌ ఈ పాత్ర ను ప‌రిచ‌యం చేస్తూ నానీ వాయిస్ ఓవ‌ర్ తో మ‌హాన‌టి చిత్ర యూనిట్ ఒక వీడియోను విడుదల చేసింది.. ఆ పాత్ర‌ను షాలిని పాండే పోషించింది.నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర్ రావు పాత్రను ఆయన మనవడు హీరో నాగ చైతన్య పోషించాడు.
Image result for సుశీల పాత్రలో షాలిని పాండే
ఈ మూవీలో డా.రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, మాళవికా నాయర్, భానుప్రియ, దివ్యవాణి,  దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్ ఇతర ముఖ్యపాత్రల‌లో క‌నిపించ‌నున్నారు. 
Image result for mahanati posters
ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, ప్రొడక్షన్ డిజైన్: శివం, ఆర్ట్: అవినాష్, కాస్ట్యూమ్స్: గౌరాంగ్, అర్చన, స్టైలిస్ట్: ఇంద్రాక్షి, కెమెరా: డాని, కళా నేతృత్వం: తోట తరణి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, దర్శకత్వం: నాగ అశ్విన్, నిర్మాత: ప్రియాంక దత్


మరింత సమాచారం తెలుసుకోండి: