తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ లో మాస్ ఫాలోయింగ్ సంపాదించిన హీరో అజిత్ కుమార్.  అజిత్ చిత్రం రిలీజ్ అవుతుందటే..తమిళ తంబీలు పండుగ చేసుకునే రేంజ్ కి ఎదిగారు..ఈ తెలుగు హీరో.  వాస్తవానికి తెలుగు ఇండస్ట్రీకి చెందిన అజిత్ మొదటి సినిమా ‘ప్రేమ పుస్తకం’ చిత్రం తర్వాత కోలీవుడ్ పయనమయ్యాడు.  అక్కడ వరుస విజయాలతో దూసుకు వెళ్లిన అజిత్ తన సహనటి షాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు..వీరికి ఇద్దరు సంతానం. 
Image result
నాలుగు పదుల వయసు దాటి, జుట్టు మొత్తం తెల్లబడినా.. ఏమాత్రం రంగు వేసుకోకుండా అలాగే హీరో పాత్రలు పోషిస్తున్నాడు. అయినా కూడా అజిత్ కు ప్రేక్షకుల ఆదరణ అదే స్థాయిలో ఉంటోంది. మూడుసార్లు ఫిల్ం ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డులు పొందిన హీరో అజిత్.   గతేడాది వివేకం వంటి యాక్షన్ చిత్రంతో పలకరించి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితమే శివ దర్శకత్వంలో విశ్వాసం సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. చాలా రోజుల క్రితమే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కాగా..తమిళనాట ఏర్పడిన బంద్ దృష్ట్యా సెట్స్ మీదకు వెళ్ళలేదు.
Image result for hero ajith
కాకపోతే ఈ మద్య కోలీవుడ్ లో వరుసగా బంద్ జరుగుతున్న కారణం తో అజిత్ షూటింగ్ చేయకుండా ఉన్నారు. బంద్ పూర్తి అవ్వడంతో..ఇవాళ్టి నుండే రామోజీ ఫిలింసిటీలో రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టారు. అజిత్ ఇందులో పల్లెటూరి పెద్ద మనిషి పాత్రలో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపించనున్నాడు.
Image result for hero ajith viswasam
గతంలో శివ, అజిత్ కాంబోలో వచ్చిన వీరం, వేదలమ్, వివేకం చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఇలా వరుసగా నాలుగో సారి కూడా కలిసి ఈ చిత్రం చేస్తుండడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. విజయ్ దీపక్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తుండగా, డి ఇమాన్ సంగీతం సమకూర్చనున్నారు. ఈ చిత్రాన్ని సత్య జ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: