మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన సినిమా రంగస్థలం. చిట్టిబాబుగా చరణ్ నట విశ్వరూపం చూపించిన సినిమా ఇది. అంతేకాదు బాహుబలి తర్వాత శ్రీమంతుడు నెలకొల్పిన నాన్ బాహుబలి రికార్డులను ఖైది నంబర్ 150తో చిరు బీట్ చేస్తే రెండేళ్లు కాకముందే ఆ రికార్డుని సైతం బ్రేక్ చేశాడు రాం చరణ్.


సుకుమార్ మార్క్ టేకింగ్ తో వచ్చిన ఈ సినిమా చరణ్ రేంజ్ ఏంటన్నది మరోసారి ప్రూవ్ చేసింది. ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను కూడా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే రంగస్థలం కలక్షన్స్ క్రాస్ చేసే ఊపు కనిపించినా బి,సి సెంటర్స్ లో రంగస్థలం రికార్డ్ కలక్షన్స్ రాబట్టడంతో 200 కోట్లను క్రాస్ చేసింది.


ఇక భరత్ కూడా బాగానే లాక్కొచ్చాడు. ఇప్పటికే భరత్ అనే నేను 160 కోట్ల గ్రాస్ కలక్షన్స్ అనే పోస్టర్ వచ్చింది. ఇక 200 కోట్ల పోస్టర్ కూడా రెడీ చేయగా నిర్మాత డివివికి రంగస్థలం మేకర్స్ నుండి షాక్ వచ్చిందట. రాం చరణ్ కు సన్నిహితుడైన దానయ్యను 200 కోట్ల పోస్టర్ గురించి క్లాస్ పీకాడట చరణ్.


అందుకే భరత్ టీం వెనక్కి తగ్గి రెండు వారాలకు 190 కోట్లు అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. మహేష్ సినిమాలకు ఎప్పుడు వచ్చే ఫేక్ కలక్షన్స్ న్యూస్ భరత్ అనే నేను సినిమాకు రావడం విశేషం. అయితే భరత్ విషయంలో వసూళ్లు మాత్రం కచ్చితంగా ఉన్నాయని లెక్కలు చెబుతున్నారు. మొత్తానికి చరణ్, మహేష్ ల పోస్టర్ రగడ ఇండస్ట్రీలోనే హాట్ న్యూస్ గా మారింది. అయితే ఈ పోస్టర్ క్లాష్ లో హీరోలకు మాత్రం ఎలాంటి సంబంధం లేకపోవడం విశేషం.




మరింత సమాచారం తెలుసుకోండి: