మహానటి సావిత్రి మీద  బయో పిక్ వస్తున్న సంగతి తెల్సిందే. ఈ సినిమా మీద ఇప్పటికే చాలా అంచనాలు ఉన్నాయి. ఎవడె సుబ్రహ్మణ్యం డైరెక్టర్ ఈ సినిమా కు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా కు ముందుగా ఎన్టీఆర్ ను అడిగిన సంగతి తెలిసిందే. దానికి ఎన్టీఆర్ ఒప్పుకోకపోవడం తెలిసిందే. ఈ సందర్బంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమా గురించి కొన్ని విషయాలు పంచున్నాడు. అతను చెబుతూ నిజానికి సావిత్రి సినిమాకు కంటెంట్ చాలా ఎక్కువే వుంటుంది.

Image result for nag ashwin director

అలాంటివి సినిమాగా, పార్ట్ లుగా తీయాలంటే బయోపిక్ లు వర్కవుట్ కాదు. నెట్ లో సిరీస్ గా తీయచ్చేమో? అలా అయితే అయిదారు పార్ట్ లు గా తీయచ్చు. సావిత్రి కోసం వెదుకుతున్నా. ఎవరు సెట్ అవుతారు అని అనుకున్నా, ఓ తమిళ సినిమాలో ఓ పాట చూస్తుంటే కీర్తిసురేష్ సూట్ అవుతుందని అనిపించింది. పైగా సావిత్రి బాల్యం, ఓల్డేజ్ రెండింటికి సూట్ కావాలంటే కీర్తి సెట్ అవుతుంది అనిపించింది. ఎవడే సుబ్రహ్మణ్యం తరువాత అయితేనే సావిత్రి సినిమా నిజాయితీగా వస్తుందనిపించింది. మరికొన్ని సినిమాలు చేసి, సక్సెస్ లు వస్తే, నిజాయితీగా తీయలేనేమో? అన్న అనుమానం వుంది.

Image result for nag ashwin director

సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ పాత్రకోసం తారక్ ను తప్ప ఎవర్నీ అడగలేదు. మరే నటుడిని ఆ పాత్రలో ఊహించలేదు. ఇప్పుడు అభిమానులకు నచ్చేలా ఏదో చేసాం. డిజిటల్ అనుకోండి. మరేదైనా అనుకోండి. అంతా సినిమా విడుదలయిన తరువాతే. సావిత్రి వందలాది సినిమాలు చేసారు. వీలయినంత వరకు కవర్ చేసాం. ఎక్కడా ఫ్లో  మిస్ కాకుండా చూసాం. అని ఈ సినిమా గురించి మీడియా కు చెప్పాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: