లండన్ లో పెరిగిన అను ఇమ్మాన్యుయేల్ కు సినిమాలలో నటించడం అంటే బాగా ఇష్టం. ఈ ఇష్టంతోనే బాలీవుడ్ లో అవకాశాలు వెతుక్కున్న అనుకు అక్కడ అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా అవకాశాలు వచ్చాయి. రాజ్ తరుణ్ తో ఒక సినిమా చేసిన తరువాత ఈమెకు అదృష్టం కలిసి రావడంతో పవన్ తో ‘అజ్ఞాతవాసి’ ఆసినిమా షూటింగ్ లో ఉండగానే అల్లు అర్జున్ తో ‘నాపేరు సూర్య’ లో నటించే అవకాశాలు రావడంతో ఈమె దశ తిరిగింది అని అనుకున్నారు అంతా. 
ANU EMMANUEL LATEST PHOTOS IN NAA PERU SURYA PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే ప్రస్తుతం ఆమెకు వరస పరాజయాలు ఎదురౌతున్న నేపధ్యంలో ఈమె పై కూడ ఐరన్ లెగ్ బ్యూటీ ముద్ర వేసారు. ఈవిషయాలు ఏమి పట్టించుకోకుండా ఈ లండన్ బ్యూటీ ఏకంగా అల్లు అర్జున్ కు చుక్కలు చూపెడుతూ వ్యవహరిస్తున్న తీరు ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. 
ANU EMMANUEL LATEST PHOTOS IN NAA PERU SURYA PHOTOS కోసం చిత్ర ఫలితం
‘నాపేరు సూర్య’ కు డివైడ్ టాక్ వచ్చినా ఆసినిమాను కనీసం మరో వారం రోజులు ఛానల్స్ లో ప్రమోట్ చేయాలని ఈమూవీ నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలకు అల్లు అర్జున్ అందుబాటులో ఉన్నా అను ఇమ్మాన్యుయేల్ ‘సూర్య’ పేరు చెపితే దొరకకుండా పారిపోతు ఈమూవీ నిర్మాతల ఫోనుకు కూడ అందుబాటులోకి రావడం లేదు అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. 
ANU EMMANUEL LATEST PHOTOS IN NAA PERU SURYA PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనితో ఈసినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలు అన్నీ హీరోయిన్ లేకుండా కేవలం బన్నీ మాత్రమే చేసుకోవలసి వస్తోంది. ఈపరిస్తుతులను గమనిస్తున్న ఇండస్ట్రీ వర్గాలు అనూ ఇమ్మాన్యుయేల్ తీరు పై చాల కోపంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వరస పరాజయాలు వస్తున్నాయి కాబట్టి టాలీవుడ్ పై అనూకు విరక్తి కలిగిందా లేదంటే సూర్య ప్రమోషన్ ఇంటర్వ్యూలకు రాకపోవడానికి వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా ? అన్న కోణంలో ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: