మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా ‘చిరుత’. హీరోగా మంచి పేరు వచ్చినా..కమర్షియల్ గా పెద్దగా హిట్ కాలేకపోయింది.  ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర’ మంచి విజయం సాధించింది.  ఈ సినిమాతో రాంచరణ్ కి మంచి పేరు రావడమే కాదు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రికార్డుల మోత మోగించింది.  అప్పటి నుంచి రాంచరణ్ నటించిన సినిమాలు అన్ని మంచి విజయాలు సాధించినా..మూడు సంవత్సరాల క్రితం కాస్త బ్రేక్ పడింది. 
Image result for rangastlam
ఆ మద్య సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ధృవ’ మరో ఘనవిజయం సాధించింది.  ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ చిత్రంలో నటించారు చరణ్.  ఈ సినిమా దాదాపు సంవత్సరం కాలం పాటు షూటింగ్ జరుపుకుంది..ఎన్నో అవాంతరాలు దాటి వచ్చిన ‘రంగస్థలం’ రిలీజ్ అయిన అన్ని థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించింది.  ఈ మధ్య కాలంలో టాక్ పరంగాను .. వసూళ్ల పరంగాను ఒక రేంజ్ లో స్పీడ్ చూపించిన మూవీ ఏది అంటే 'రంగస్థలం' అని ఎవరైనా చెప్పేస్తారు.
Related image
అంతలా ఈ సినిమా ప్రేక్షకుల మనసులను కట్టి పడేసింది .. ఒకటికి రెండుసార్లు వాళ్లు థియేటర్లకు వచ్చేలా చేసింది. 1985 కాలం నాటి పరిస్థితులు..ప్రేమ, రాజకీయం..అన్ని ఎమోషన్స్ దర్శకులు సుకుమార్ ఈ సినిమాలో చూపించి ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించారు.  రంగస్థలం కలెక్షన్ల విషయానికి వస్తే.. 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా, 120 కోట్ల షేర్ ను రాబట్టింది.
Related image
నైజామ్ ఏరియాలో 18 కోట్లకు అమ్ముడు కాగా, 34 రోజుల్లో 27 కోట్లను వసూలు చేసింది. సీడెడ్లో 12 కోట్లకు అమ్ముడుపోగా అంతే సమయంలో 17 కోట్లను రాబట్టింది. ఉత్తరాంధ్రలో 8 కోట్లకి పోయిన ఈ సినిమా,12.08 కోట్ల షేర్ ను తెచ్చిపెట్టింది. ఓవర్సీస్ రైట్స్ 9 కోట్లకి పోగా 16.5 కోట్ల షేర్ వచ్చింది. ఇలా ఈ సినిమా భారీ లాభాలను సొంతం చేసుకుంటూ చరణ్ కెరియర్లోనే ది బెస్ట్ గా నిలిచింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: