బాలీవుడ్ హీరోయిన్ సోన‌మ్ క‌పూర్‌, వ్యాపార వేత్త ఆనంద్ ఆహుజాల  వివాహం నేడు (మే 8)  ముంబైలోని బాంద్రాలో ఉన్న జుహూ నివాసంలో అంగరంగ వైభవంగా జరగనున్న విషయం తెలిసిందే. పెళ్లి వేడుక కంటే ముందు మెహందీ, సంగీత్ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు కపూర్ ఫ్యామిలీతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు హాజరైన సందడి చేశారు.   

మెహందీ వేడుకలో పెళ్లి కూతురు ఛుదా (ఎర్రని గాజులు) ధరించి, గాజులతో పాటు కలేరి (సాంప్రదాయ వస్తువు)ని ఇతర అమ్మాయికి తాకించే ప్రయత్నం చేస్తారు.  నిన్న సాయంత్రం జ‌రిగిన‌ సంగీత్ వేడుక‌లో కత్రినా కైఫ్‌, జాన్వీ, ఖుషీ, రేఖ‌, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ త‌దిత‌రులు మెరిసారు. అంద‌రు ప‌లు బాలీవుడ్ మూవీలోని సాంగ్స్‌కి స్టెప్పులేశారు. ప్ర‌స్తుతం సోన‌మ్‌-ఆహుజాల సంగీత్‌, మెహందీ వేడుక‌కి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.
అచ్చం శ్రీదేవిని చూసినట్లే
తమ సోదరి సోనమ్ కపూర్ పెళ్లి వేడుకలో జాహ్నవి కపూర్, ఖుషీ కపూర్ సందడి చేశారు. జాహ్నవిని చూసిన వారందరూ.. అచ్చం శ్రీదేవిని చూసినట్లే ఉందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

పెళ్లి త‌ర్వాత సోన‌మ్ త‌న తాజా చిత్రం వీరే ది వెడ్డింగ్ చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్రమాల‌లో పాల్గొన‌నుంది . ఈ చిత్రం జూన్ 1న విడుద‌ల కానుంది. మ‌రోవైపు సంజూ చిత్రంలో గెస్ట్ పాత్ర పోషిస్తున్న సోన‌మ్ మే 14, 15 తేదీల‌లో కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్ రెడ్ కార్పెట్‌పై న‌డ‌వ‌నున్న సంగ‌తి తెలిసిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: