తెలుగు ఇండస్ట్రీలో మొదటి సారిగా సినీ తారపై వస్తున్న బయోపిక్ ‘మహానటి’ కి రోజు రోజుకీ ఆదరణ విపరీతంగా పెరిగిపోతుంది.  ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, సాంగ్స్, క్యారెక్టర్స్ కి సంబంధించిన వీడియోలు అంచనాలు పెంచేస్తున్నాయి.  అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ఎవడే సుబ్రమణ్యం ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న మహానటి మే 9 న రిలీజ్ కాబోతుంది.

సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా..ఆమె భర్త జెమిని గణేష్ పాత్రలో దుల్కన్ సల్మాన్ నటిస్తున్నారు.  ఈ చిత్రంలో టాలీవుడ్ టాప్ నటులు నటిస్తున్నారు.  అందువలన ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ ఉండొచ్చని అనుకుంటున్నారు. ఈ సినిమా థియేటర్లకు వస్తుందనీ, వచ్చి చూసి ఈ సెలబ్రేషన్ లో భాగస్వాములు కావాలని సినీ ప్రముఖులకు ఈ సినిమా టీమ్ ఆహ్వాన పత్రికలు పంపించినట్టుగా తెలుస్తోంది.
Image result for mahanati posters
జీడిపప్పు మిఠాయితో కూడిన బాక్స్ తో పాటు ఆహ్వాన పత్రికలను పంపించడం విశేషం. అలాంటి ఆహ్వాన పత్రికను అందుకున్న 'బాహుబలి' నిర్మాత శోభు యార్లగడ్డ, ఈ సినిమా టీమ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. 
Image result for mahanati posters
ఒక మహానటి బయోపిక్ చిత్రాన్ని ప్రేక్షకులు అందించడంలో తనకు ఎంతో గర్వంగా ఉందని..ఇది ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులు చూడదగ్గ చిత్రం అని దర్శకులు నాగ్ అశ్విన్ అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: