రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు గొప్ప దర్శకుడు. ఎన్ని గొప్ప సినిమాలు తీసి అందరికి ఇన్స్పిరేషన్ గా నిలిచాడు. కానీ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కు హిట్ వచ్చి చాలా ఏళ్ళు దాటి పోయింది. అయితే తన సినిమా ల ద్వారా కంటే ఎప్పుడు కాంట్రవర్సి లతో కాలం గడిపే రామ్ గోపాల్ వర్మ మళ్ళి పవన్ అభిమానులను గెలికాడు. సినిమా టీజర్ ఘోరంగా ఉందని ఇప్పటికే అందరూ పెదవి విరుస్తున్నారు. 

Image result for ram gopal varma

దీంతో ఇప్పుడు ఈ నెగిటివ్ ను పవన్ ఫ్యాన్స్ మీదకు తోసేస్తున్నాడు వర్మ. ఆఫీసర్ రెండో టీజర్ కు 11వేల డిస్లైక్ లు వచ్చాయట. పవన్ ఫ్యాన్స్ 11వేల మందేనా? అంటూ సర్కాస్టిక్ ట్వీట్లు చేస్తున్నాడు. అక్కడికి ఏదో తన టీజర్ అదిరిపోయింది అన్నట్లు, డిస్లైక్ చేసేవారంతా పవన్ ప్యాన్స్ అన్నట్లు. రేపు 25 న సినిమా విడుదలయి, తేడావస్తే, అప్పుడూ పవన్ ఫ్యాన్స్ థియేటర్ కు రావకపోవడం వల్లనే.. అంటారేమో? కొంపదీసి..!

Image result for ram gopal varma

టీజర్ కు వచ్చిన డిస్ లైక్ల వ్యవహారాన్ని సీరియస్ ఇస్యూగా సాగదీయాలని చూస్తున్నట్లుంది వర్మ. ఏకంగా ఒకటి కాదు, రెండు, మూడుకాదు, ఇంకా ఎక్కువ ట్వీట్లు చేసాడు. ఇవన్నీ చూస్తుంటే ఆఖరికి వర్మ ఈ విధంగా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నట్లుంది అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా  ఇటువంటి తెలివి కొంచెం సినిమా మేకింగ్ లో ఉపయోగిస్తే బాగుంటాదని కొందరు కామెంట్ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: