సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన భరత్ అనే నేను మూవీ తెలుగు రెండు రాష్ట్రాల్లో, ఓవర్సీస్ లోనే కాదు తమిళనాట కూడా మహేష్ కు ఓ అరుదైన రికార్డ్ సృష్టించేలా చేసింది. బాహుబలి తర్వాత ఏ తెలుగు సినిమా సాధించని కలక్షన్స్ భరత్ అనే నేను వసూళు చేసింది. 


చెన్నైలోనే ఏకంగా 1.60 లక్షల కలక్షన్స్ సాధించిన భరత్ అనే నేను.. ఓవరాల్ గా తమిళనాడులోనే 4.5 కోట్ల వసూళ్లను రాబట్టింది. మహేష్ చెన్నైలో సృష్టించిన అరుదైన రికార్డ్ గా ఇది చెప్పుకోవచ్చు. మహేష్ సిఎంగా నటించిన ఈ సినిమాలో ప్రజల మేలుకోరే సిఎం ఎలా ఉంటాడో చూపించారు.


అసలైతే మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన స్పైడర్ కోలీవుడ్ లో మహేష్ స్టామినా ప్రూవ్ చేస్తుందని అనుకున్నారు. ఆ సినిమా పర్వాలేదు అనిపించుకున్నా వసూళ్ల పరంగా అంత హడావిడి చేయలేదు. అయితే భరత్ అనే నేను కేవలం తెలుగు వర్షనే తమిళనాట రికార్డ్ కలక్షన్ తెచ్చిపెట్టింది.


సిఎం భరత్ తమిళ ప్రజలకు నచ్చేసినట్టు ఉన్నాడు. అందుకే భారీ వసూళ్లను రాబట్టేలా చేశారు. రెండు వరుస ఫ్లాపుల తర్వాత మహేష్ అందుకున్న భరత్ అనే నేను సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ 25వ సినిమా వంశీ పైడిపల్లి డైరక్షన్ లో రాబోతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: