తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘మహానటి’ ప్రీమియర్ షోల టాక్ బయటకు వచ్చింది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ ప్రీమియర్ షోలను చూసిన ప్రేక్షకులు ఈమూవీ చాల బాగుంది అని చెప్పడమే కాకుండా ఈమూవీ అద్భుత విజయం సాధిస్తుంది అని కామెంట్స్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
MAHANATI MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేశ్ ‘మహానటి’ పాత్రకు జీవం పోసింది అని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్ర ప్రీమియర్ షోల ప్రదర్శన యుఎస్ లో పూర్తి అయిన నేపధ్యంలో ఈ మూవీ ఒక దృశ్య కావ్యంలా ఉంది అంటూ ఓవర్సీస్ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈమూవీలో అక్కినేని నాగేశ్వరావు పాత్రలో నటించిన నాగచైతన్య తన తాతగారి పాత్రలో చైతు అచ్చు గుద్దినట్లు దిగిపోయాడని ఓవర్సీస్ ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 
MAHANATI MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అంతేకాదు నాగార్జున అత్యంత ధైర్యంగా నాగాచైతన్యను పెట్టి అక్కినేని బయోపిక్ ను వెంటనే మొదలు పెట్టుకోవచ్చు అంటూ ఓవర్సీస్ ప్రేక్షకులు చేస్తున్న కామెంట్స్ నాగార్జునకు మంచి జోష్ ను ఇస్తాయి. ఇక జెమినీ గణేషన్ పాత్రలో నటించిన మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కీర్తి సురేశ్ ల మధ్య లవ్ కెమిస్ట్రీ అదిరిపోయిందని ముఖ్యంగా వీరిద్దరి పెళ్ళి సన్నివేశంలో వీరిద్దరూ కనపరిచిన నటన ప్రేక్షకులకు కన్నుల పండుగగా ఉంది అంటూ ఓవర్సీస్ ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. 
MAHANATI MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అంతేకాదు ‘మహానటి’ చిత్రాన్ని ఓవర్సీస్ ప్రేక్షకులు క్లాసిక్ ఫిలింగా అభివర్ణిస్తున్నారు. ‘బాహుబలి 2’ తరువాత తెలుగు ప్రేక్షకులు అందర్నీ ఆకర్షించే మూవీగా ఈసినిమా మారుతుంది అని కామెంట్స్ వస్తున్న నేపధ్యంలో ఈమూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ‘మహానటి’ చిత్రానికి ఆడియన్స్ నుంచి యునానిమస్ టాక్ వస్తున్న నేపధ్యంలో ఈమూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం ఖాయం అని అంటున్నారు. ఈమూవీ మంచి విజయం సాధించింది అని మొదటి టాక్ వస్తున్న నేపధ్యంలో ఇక రానున్న రోజులలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలమంది ప్రముఖుల జీవితాల పై బయోపిక్ లు వచ్చే ఆస్కారం ఉంది. ముఖ్యంగా ‘మహానటికి’ వచ్చిన ఈ టాక్ తో నందమూరి బాలకృష్ణ ‘ఎన్టీఆర్’ బయోపిక్ విషయంలో మరింత వేగం పెంచే ఆస్కారం ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: