విశ్వవిజేత అలగ్జాండర్ ప్రపంచాన్ని జయించుకుంటూ వచ్చి భారత్ ప్రవేశ ద్వారం వద్ద చావుదెబ్బ తగిలనుందని ఊహించి తిరిగివెళ్ళిపోతూ మరణించాడు. విశ్వం మొత్తం జైత్రయాత్ర చేసిన బాహుబలికి "చైనా మార్కెట్" మాత్రం షాకర్ లా అడ్డుతగిలింది. బాహుబలి-1 సినిమా చైనా లో చేదు అనుభవం రుచిచూసింది.  ఇప్పుడు బాహుబలి-2 సినిమా కూడా వైఫల్యం దిశగా దూసుకుపోతోంది. అమీర్ ఖాన్ నటించిన దంగల్ ను క్రాస్ చేస్తుందనుకున్న ఈ సినిమా, చైనాలో విడుదలకు పెట్టిన  ఖర్చులు రాబట్టుకోవడానికి కూడా చాలా అవస్థలు పడుతోంది.
bahubali 2 images in china కోసం చిత్ర ఫలితం
గత వారం చైనా లో ఐమాక్స్ లో విడుదలైన ఈ సినిమా, ప్రారంభం రోజు బాగానే బాగానే ఓపెనింగ్స్ ను రాబట్టింది. అంతా బాగుందనుకున్న సమయానికే అంటే రెండో రోజు నుంచే క్రమక్రమంగా చతికిలపడడం ప్రారంభించింది. అలా వారం తిరిగేసరికి ఈ సినిమా వసూళ్లు అటు ఇటుగా 57కోట్ల రూపాయలు మాత్రమే. చైనా బాక్సాఫీస్ లో ఈ ఎమౌంట్ అంటే ఫ్లాప్ కింద లెక్క. ఈ సినిమా నుంచి నిర్మాతలు ఆశినచిన వ్యాపార వసూళ్ళు మొత్తం 120 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంది. 
bahubali 2 images in china కోసం చిత్ర ఫలితం
ఇండియా లోనే అత్యథిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా బాహుబలి-2 నిలిచింది. భారీ బాలీవుడ్ చిత్రాల్ని సైతం తల దన్ని ఈ ఘనత సాధించింది. చైనాలో ఏమాత్రం ఫేర్ చేసినా ఓవర్సీస్ వసూళ్లతో కూడా ప్రపంచవ్యాప్తంగా అత్యథిక వసూళ్లు సాధించిన భారతీయచిత్రం గా కూడా నిలిచి ఉండేది. కానీ, ఊహించని విధంగా దంగల్ సినిమా చైనా లో బ్లాక్ బస్టర్ విజయాన్నందుకుంది. కాని బాహుబలి-2కు ఆ ఘనత గౌరవం దక్కలేదు. వరల్డ్ వైడ్ అత్యథిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా దంగల్ నిలిచింది.  చైనా విడుదలతో ఈ రికార్డును బాహుబలి-2 అందుకుంటుందని అంతా ఊహించారు. కానీ బాహుబలికి అది కలగానే మిగిలిపోయింది.
bahubali 2 images in china కోసం చిత్ర ఫలితం
బాహుబలి లాంటి సినిమా  లు చైనీయులకు కొత్త కాదు. చైనీయులకు మన సాంకేతికత స్థాయి తక్కువగా అనిపించి ఉండొచ్చు. వారికి మంచి కథతో పాటు అవసరమైన  చోట చక్కని సాంకేతికతను కోరుకుంటారట. అయితే దంగల్ మొత్తం కథ మీద "స్త్రీ సాధికారత-మహిళలు సరైన శిక్షణతో రంగంలోకి దిగితే ఏమైనా ఎంతైనా సాధిస్తారనే సందేశం ఉండటం" వారు ఇష్టపడ్డారు.  అక్కడ పెద్ద సాంకేతిక అవసరం లేదు అందుకే ఆ సినిమా విజయం సాధ్యమైంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: