తెలుగు చలన చిత్రసీమలో ఎన్టీఆర్, ఎఎన్ఆర్ లు రెండు కళ్లుగా చెబుతారు.  అయితే వారితో సమానంగా నటించి ప్రేక్షాదరణ పొందిన మహానటి సావిత్రి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎస్వీఆర్ తోను సరితూగ గల నటనను ప్రదర్శించి ఆమె శభాష్ అనిపించుకున్నారు.  సావిత్రి జీవితచరిత్రగా తెరకెక్కిన 'మహానటి' ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదట సావిత్రి బయోపిక్ అనగానే చాలామంది లైట్‌గా తీసుకున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌.. టైటిల్ రోల్‌ని కీర్తిసురేష్ పోషించడంతో పెద్దగా అంచనాలు లేవు.

ఎప్పుడు ఆమె లుక్ బయటకువచ్చిందో అందులోనూ ఆసక్తి పెరిగింది. సౌత్ వుమెన్ సూప‌ర్‌స్టార్ సావిత్రి లైఫ్ స్టోరీపై తెరకెక్కించిన మూవీ ‘మహానటి’ తెలుగు రాష్ర్టాలతోపాటు ఓవర్సీస్‌లో భారీ ఎత్తున రిలీజైంది. ఆమెకి సంబంధించి చాలా విషయాలు సేకరించిన తర్వాత ‘మ‌హాన‌టి’ పేరుతో ప్రయత్నం చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సీరియస్ నోట్‌తో సావిత్రి మరణానికి సంబంధించిన అనేక విషయాలు వస్తుండగా, బెంగ‌ళూరులోని చాళుక్య హోట‌ల్‌లో సావిత్రి కోమాలో ఉంటుంది.

ఒకప్పుడు సౌత్ స్టార్‌గా వెలుగొందిన ఆమె, కోమా స్టేజ్‌లోకి ఎందుకు చేరుకుంది? ఆమె గురించి ‘ప్రజావాణి’ డైలీ క‌వ‌ర్ స్టోరీకి మ‌ధుర‌వాణి (సమంత) ఫొటోగ్రాఫ‌ర్ విజ‌య్ఆంటోని (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) వివ‌రాలు సేక‌రించ‌డం మొద‌లుపెడ‌తారు. సావిత్రి బాల్యం విజయవాడ నుంచే మొదలవుతుంది. గ్లామర్ ఇండస్ర్టీకి ఎంట్రీ ఇవ్వడం, ఆపై స్టార్ హీరోయిన్‌ ఎత్తుకి ఎద‌గ‌డం జరుగుతుంది. జెమినిగణేషన్ తో ఆమె వివాహం..తర్వాత విడిపోవడం..మద్యాని బానిస కావడం..ఇలా ఎన్నో అంశాలు ఈ చిత్రంలో చూపించారు. సావిత్రిగా కీర్తి సురేశ్ నటన అభినందనీయమని చెబుతున్నారు.

సావిత్రి .. జెమినీ గణేశన్ లు గా కీర్తి సురేశ్ .. దుల్కర్ సల్మాన్ అదరగొట్టేశారట. ప్రేమ సన్నివేశాల్లో ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరిందని అంటున్నారు. సమంత చాలా సహజంగా నటించిందనీ .. ఏఎన్నార్ లుక్ తో కనిపించి చైతూ ఆశ్చర్యపరిచాడని చెబుతున్నారు. ఈ సినిమా ప్రీమియం టాక్ అయితే పాజిటీవ్ గానే వచ్చింది..మరి రేపటి వరకు సినిమా పరిస్థితి ఎలా ఉండబోతుంది..రిజల్ట్ ఏ విధంగా వస్తుంది..హిట్టా..ఫట్టా అన్న విషయం తెలియనుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: