సంపూర్ణేష్ బాబు ఈ పేరు వినగానే ముందుగా గుర్తకు వచ్చేది అయన హీరోగా చేసిన హృదయ కాలేయం.  ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో నవ్వులు సునామీ సృష్టించాడు. అంతకు ముందు సంపూర్ణేష్ బాబు సోషల్ మీడియా వేదికగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. దాంతో ఈ సినిమా రిలీజ్ తర్వాత  వరుసగా కొన్ని సినిమాల్లో ఛాన్స దక్కించుకున్నాడు.  ఆ తర్వాత ‘సింహం 123’ లో నటించాడు.  ఈ సినిమా తర్వాత కూడా కొన్ని సినిమాలు వచ్చాయి. 
 మూడు పాత్రల్లో సంపూర్ణేష్ బాబు
‘బిగ్ బాస్' తెలుగు ఫస్ట్ సీజన్ పూర్తయిన తర్వాత సంపూర్ణేష్ బాబు సందడి తగ్గింది.   ఆ తర్వాత సంపూ జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి. ఎప్పుడూ ఏదో ఒక సెన్సేషన్‌తో వార్తల్లో ఉండే ఆయన కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోవడమే అందుకు కారణం. ఈ రోజు సంపూర్ణేష్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న 'కొబ్బరిమట్ట' చిత్ర బృందం బర్త్ డే పోస్టర్ విడుదల చేశారు.
 ఫస్ట్ వీక్ గ్రాస్ రూ. 233.64 కోట్ల అంచనా
సమ్మర్ రిలీజ్‌గా ఈ సినిమా ఉండబోతోందని అందులో పేర్కొనబడి ఉంది. ఎప్పుడో నాలుగేళ్ల కిందట ప్రారంభమైన తన  'కొబ్బరి మట్ట' చిత్రం ఇప్పటికి రిలీజ్ కాలేదు. అందరూ అనుకోవచ్చు సినిమా భారీ ఎత్తున షూటింగ్ జరుపుకుంటుందని.. కానీ అలాంటిది ఏమి లేదు ఎప్పుడో పూర్తయిన ఈ సినిమా రీలీజ్ వాయిదా పడింది. దీనికి కారణం నిర్మాతలేనట.. తాజాగా ఈ సినిమాకు రిలీజ్ కష్టాలు తీరాయి అతి త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు మూడు పాత్రల్లో కనిపించబోతున్నారు. పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడు పాత్రల్లో ప్రేక్షకులను అలరించబోతున్నారు.  
 తెర వెనక
కొమరిమట్ట' సినిమా రాబోతోంది. తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ తిరగ రాస్తుంది. తొలివారం మా చిత్రం రూ. 233.64 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నాం అంటూ ప్రమోషన్ పోస్టర్ విడుదల చేయడం హాట్ టాపిక్ అయింది. ఈ చిత్రానికి నిర్మాత: ఆది కుంభగిరి, కథ-స్క్రీన్ ప్లే, మాటలు: స్టీవెన్ శంకర్, కూర్పు : కార్తీక శ్రీనివాస్, స్టంట్స్: జాషువ, సంగీతం: కమ్రన్, లైన్ ప్రొడ్యూసర్: సురేష్, దర్శకత్వం: రూపక్ రొనాల్డ్ సన్. 


మరింత సమాచారం తెలుసుకోండి: