సిని స్టార్ నటీ నటుల మద్య శృంగార సంబందాలను గుఱించి చర్చించుకోకుండా ఉండటమే మంచిది. కారణం సహజీవనం లో ఉండనివారు చాలా తక్కువమందే ఉంటారు ముఖ్యంగా బాలీవుడ్లో లివ్-ఇన్-రిలేషణ్-షిప్ అతి సహజం. అయితే సోనం కపూర్ తన సంబంధ బాందవ్యాల గురించి అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పేసింది.   


ఒకవైపు సోనమ్ కపూర్ పెళ్లి జరుగుతుంటే, ఆమె గత ప్రేమ వ్యవహారాలను, గతంలో ఆమె చేసిన కామెంట్లను ప్రస్తావించే పనిలో పడింది బాలీవుడ్ మీడియా. గతంలో సోనమ్‌కు రణ్‌బీర్ కపూర్‌ తో చిన్నపాటి ప్రేమ కథ ఉండేదని మీడియా గుర్తు చేస్తోంది. సోనమ్ పెళ్లి చేసుకుంటున్న తరుణంలో రణ్‌బీర్ కపూర్ ఎక్కడున్నాడో వెదుకుతోంది మీడియా.
savariya కోసం చిత్ర ఫలితం
రణ్‌బీర్ కపూర్, సోనమ్ కపూర్‌ ఇద్దరూ ఒకే సినిమా తో అదే ‘సావరియా’ కెరీర్ ఆరంభించారు.  దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన ఈ కళాఖండం అప్పట్లో భారీ అంచనాల మధ్యన వచ్చి ఒక మాదిరిగా చిత్రం అనిపించుకుంది. అయితే రణ్‌బీర్, సోనమ్‌ ల గ్రాండ్ లాంఛింగ్‌ కు మాత్రం ఈ సినిమా బాగా ఉపయోగపడింది.


అప్పట్లో వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారనే వార్తలు అయితే వచ్చాయి. వాటిని ఈ హీరో హీరోయిన్లు ధ్రువీకరించలేదు. ఆ సంగతలా ఉంటే, కొన్నాళ్ల కిందట సోనమ్ కపూర్ ఒక మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రేమ సంబంధాల గురించి స్పందించిన విషయాలను మీడియా ఇప్పుడు ప్రస్తావిస్తోంది.
sonam kapoor కోసం చిత్ర ఫలితం
తనకు ఏ హీరో తోనూ సెక్సువల్ రిలేషన్-షిప్ లేదని ఆ ఇంటర్వ్యూ లో సోనమ్ కుండబద్ధలు కొట్టి చెప్పింది. చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు ఇష్టమైన సెక్స్ యాంగిల్ గురించి కూడా చెప్పేస్తుంటే సోనమ్ మాత్రం, ఎవ్వరితోనూ అలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.


తను పని చేసిన హీరోల తో అలాంటి సంబంధాలు పెట్టుకోవడం అనైతికం అని తనకు అనిపించిందని సోనమ్ వివరించింది. వారికి వేరే బంధాలున్నప్పుడు వారితో సంబంధం ఏర్పరుచు కోవడం అనైతికమే కదా? అని కూడా సోనమ్ ప్రశ్నించింది అప్పట్లో. వివాహం నేపథ్యంలో సోనమ్ చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా వర్గాలు ప్రస్తావిస్తున్నాయి.
సంబంధిత చిత్రం
పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సోనమ్ కపూర్ గతంలో తన రిలేషన్‌షిప్స్ గురించి చేసిన వ్యాఖ్యానాలు సంచలనంగా మారాయి. ఆమె కెరీర్ ప్రారంభం నుంచి చేసిన వ్యాఖ్యలు, ఆమె కెరీర్‌లో మలుపులు చర్చనీయాంశాలుగా నిలుస్తున్నాయి. కొన్నాళ్ల కిందట బాలీవుడ్ నటి నేహా దూపియా నిర్వహించే టాక్ షో‌కి హాజరైన సోనమ్ కపూర్ తన లవ్ రిలేషన్ షిప్ గురించి వివరించింది. తను సింగిల్ అని అప్పట్లో సోనమ్ స్పష్టం చేసింది.


తను ఏ నటుడి తోనూ డేటింగ్ చేయలేదని, ఎవరితోనూ సెక్సువల్ రిలేషన్ లేవని సోనమ్ వ్యాఖ్యానించింది. అలాంటి బంధాలు ఏవీ లేకపోవడం కారణం ఏమిటి? అని నేహా అడుగగా, తన సహనటులు ఎవరూ తనను ఆకట్టుకోలేదని, ఆకర్షించలేదని చెప్పేస్తూ నవ్వేసింది సోనమ్ కపూర్. తనకు పెళ్లైన సంబర్భంగా సరదాగా అప్పుడు జరిగిన విషయాలను గుర్తుచేసుకుంటున్నారు.

హీరోలతో సెక్స్ రిలేషన్స్ లేవంటున్న సోనమ్ కపూర్

మరింత సమాచారం తెలుసుకోండి: