మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన 'మహానటి' చిత్రం భారీ అంచనాల నడుమ బుధవారం నాడు థియేటర్స్‌లో విడుదలైంది. 'మహానటి' చిత్రంలో అగ్రతారలే నటించారు..ముఖ్యంగా అలనాటి గొప్ప నటుల్లో ఒకరు  ఎస్వీ రంగారావు పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించారు. మహానటి తెలుగులో వచ్చిన ఈ మొట్టమొదటి బయోపిక్ చిత్రం ఓ అద్భుత దృశ్య కావ్యం. జీవితంలో నుండి వచ్చిన అనుభవాలను నేటి తరానికి కళ్లకు కట్టిచూపించారు. తెలుగు సినిమా చరిత్రలో మరో క్లాసికల్ మూవీ. 

మహానటిపై  సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఈ సినిమాలో ఎస్వీ రంగారావు పాత్ర పోషించి ఆకట్టుకున్న మంచు మోహన్ బాబు చిత్ర యూనిక్ కి ధన్యవాదాలు తెలుపుతూ తాజాగా ఓ ట్వీట్ చేశారు. 'అశ్వినీదత్ ఒక మంచి నిర్మాత. అతని కుమార్తెలిద్దరూ ధైర్యం చేసి డబ్బుకు వెనుకాడక 'సావిత్రి' జీవిత చరిత్రని సినిమాగా తీశారు. గొప్ప విజయాన్ని సాధించిందని విన్నాను. అటువంటి మంచి సినిమాలో నాకూ ఒక మంచి పాత్రనిచ్చి 'శభాష్' అనిపించుకునేలా చేశారు.

ది క్రెడిట్ గోస్ టూ ది డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్.  ఆ బిడ్డలు చేసిన ఈ ప్రయత్నం విజయవంతమైనందుకు ఆ భగవంతుడు వారికీ నిండు నూరేళ్ళు ప్రసాదించాలనీ, అయురారోగ్యాలతో ఉండాలని, ఇటువంటి మంచి సినిమాలు మరెన్నో తీయ్యాలని ఆ బిడ్డలనిద్దరినీ ఆశీర్వదిస్తున్నాను' అంటూ మోహన్ బాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు.  మరోవైపు ‘మహానటి’ చిత్రంలో మోహన్‌బాబు అచ్చం ఎస్వీరంగారావులా కనిపించి, ఆకట్టుకున్నారు. పౌరాణికమైనా, సాంఘీకమైనా.. ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే మోహన్ బాబు..ఈ చత్రంలో ఎస్వీ రంగారావుని మరిపించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: