‘అజ్ఞాతవాసి’ ఫెయిల్యూర్ తరువాత షాక్ లోకి వెళ్లిపోయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం జూనియర్ తో తీస్తున్న మూవీకి సంబంధించిన సెకండ్ షెడ్యూల్ మొదలైంది. ఈసినిమాకు సంబంధించి కీలకమైన సన్నివేశాలను తీసే ఈషెడ్యూల్ అత్యంత కీలకమైనది కావడంతో త్రివిక్రమ్ చాలా ఏకాగ్రతతో ఈమూవీకి సంబంధించిన సీన్స్ చిత్రీకరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
TRIVIKRAM LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఎన్టీఆర్‌ ని డిఫరెంట్‌గా ప్రజెంట్ చేయాడానికి ప్రయత్నిస్తున్న త్రివిక్రమ్ ఈమూవీలో  తారక్ ను మిలటరీ ఆఫీసర్‌ గా చూపించబోతున్నాడు అని తెలుస్తోంది. అయితే ఈమూవీ  దేశభక్తి ప్రధాన చిత్రం కాదని పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ అని   త్రివిక్రమ్ టీమ్ లీకులు ఇస్తోంది. చిత్తూరుజిల్లా ప్రాంతానికి చెందిన ఫ్యాక్షన్ డ్రాప్ స్టోరీ తో ఈమూవీ నడుస్తుందని సమాచారం.
TRIVIKRAM LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇది ఇలా ఉండగా  ఈ మూవీ టైటిల్ గురించి దృష్టిపెట్టి అనేక పేర్లు ఆలోచించిన త్రివిక్రమ్ ‘అ’ అక్షరంతో  మొదలయ్యే నాలుగైదు అక్షరాలు ఉండేలా ఈమూవీకి టైటిల్ ను అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు త్రివిక్రమ్ ‘అసామాన్యుడు’ అనే టైటిల్‌ ని ఈమూవీకి సీరియస్‌ గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 
TRIVIKRAM LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే త్రివిక్రమ్ మనసులో ‘అ’ సెంటిమెంట్ తో ఈ ఆలోచన చేస్తుంటే ‘అజ్ఞాతవాసి’ ఘోర పరాజయం తరువాత కూడ ఈ ‘అ’ సెంటిమెంట్ తో త్రివిక్రమ్ తారక్ తో మరొక ప్రయోగం చేస్తున్నాడా అన్న టెన్షన్ లో జూనియర్ అభిమానులు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఒక అన్‌ సక్సెస్‌ ఫుల్ ఎక్స్‌పరిమెంట్‌ని జూనియర్ ఎన్టీయార్ మీద మళ్ళీ త్రివిక్రమ్ ఎందుకు ప్రయోగిస్తున్నాడు అన్న సందేహాలు కూడ జూనియర్ అభిమానులను వెంటాడుతున్నాయి. తారక్ అభిమానుల ఉద్దేశాలు తెలుస్తున్నాయి కాబట్టి త్రివిక్రమ్ యంగ్ టైగర్ అభిమానుల ఉద్దేశాలకు విలువ ఇస్తాడా ? లేదంటే తన ‘అ’ సెంటిమెంట్ కే ఓటు వేస్తాడా అన్న విషయం మరికొన్ని రోజులలో తేలిపోతుంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: