సావిత్రి బయోపిక్ గా మహానటి సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా వైజయంతి మూవీస్, స్వప్నా సినిమాస్ బ్యానర్లో ప్రియాంకా దత్ నిర్మించింది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించి మెప్పించగా జెమిని గణేషన్ పాత్రలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కనిపించారు.


సినిమాలో మధురవాణిగా సమంత ఎప్పటిలానే తన బెస్ట్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ఆంటోనిగా విజయ్ దేవరకొండ అలరించాడు. సావిత్రి కథ కాబట్టి అందులో ఎన్.టి.ఆర్, ఏయన్నార్ ల ప్రస్థావన రాక తప్పదు. ఏయన్నార్ గా నాగ చైతన్య కనిపించి అలరించాడు. తానో హీరో అయినా ఓ రెండు రోజులు డేట్స్ ఇచ్చి ఐదారు సీన్స్ లో కనిపించి సినిమా వెయిట్ పెంచాడు.


ఇక ఎటొచ్చి ఎన్.టి.ఆర్ గానే జూనియర్ ఎన్.టి.ఆర్ ను అనుకున్నా చేసేందుకు ఆయన ఒప్పుకోలేదు. ఇక వేరే వాళ్లతో చేసే ధైర్యం చేయలేదు. ఫైనల్ గా మహానటిలో కేవలం ఒక్కసారి అది కూడా గ్రాఫిక్స్ తో ఎన్.టి.ఆర్ ను చూపించడం జరిగింది. అదే తారక్ చేసుంటే తప్పకుండా మహానటిలో ఎన్.టి.ఆర్ పాత్రకు కొంత ప్రాధాన్యత ఉండేది.


ఆ ఒక్కటి తప్ప మహానటి సినిమాలో వేలెత్తి చూపించేది ఏది లేదని చెప్పొచ్చు. ఇక కీర్తి సురేష్ అయితే ఆ మహానటిగా పాత్రలో నటించడం కాదు జీవించారని చెప్పొచ్చు. అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ తో కీర్తి సురేష్ ప్రేక్షకుల మనసులను గెలిచింది.



మరింత సమాచారం తెలుసుకోండి: