మహానటి సావిత్రి జీవిత కథను చిత్రరూపం దాల్చారు దర్శకుడు నాగ్ అశ్విన్. మొదటి సినిమా ఎవడే సుబ్రమణ్యంతోనే దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్న నాగ్ అశ్విన్ మహానటితో మరోసారి తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమా సక్సెస్ లో ముఖ్య కారణం సినిమాకు కాస్టింగ్ కు దర్శక నిర్మాతలు తీసుకున్న జాగ్రత్తే అని చెప్పొచ్చు.


అయితే ఈ సినిమాలో జెమిని గణేషన్ పాత్రకు దుల్కర్ సల్మాన్ బాగా చేశాడన్న కామెంట్స్ వస్తున్నాయి. అసలు ఈ పాత్రకు నాగ్ అశ్విన్ విజయ్ దేవరకొండను అనుకున్నాడట. మొదట దుల్కర్ సల్మాన్ నే ఫైనల్ చేసినా అతనికి డేట్స్ అడ్జెస్ట్ అవడం కుదరదని చెప్పారట. అందుకే విజయ్ ను ప్రిఫర్ చేశారట.


విజయ్ జెమిని గణేషన్ పాత్ర ముందు భయపడినా ఫైనల్ గా చేసేందుకు సిద్ధమయ్యాడట. కాని ఈలోగానే దుల్కర్ సల్మాన్ తన డేట్స్ అడ్జెస్ట్ చేసుకుని ఈ పాత్రను ఓకే చేశాడట. జెమిని గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ఇక మహానటిగా కీర్తి సురేష్ అయితే అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది.


జెమిని గణేషన్ పాత్ర మిస్ అయినా మహానటిలో ఆంటోనిగా ప్రజావాణి పత్రిక కెమెరా మన్ గా కనిపించాడు విజయ్. సమంతతో ఓ చిన్న లవ్ ట్రాక్ కూడా చేశాడు విజయ్. మొత్తానికి మహానటి లాంటి అద్భుతమైన సినిమాలో తానో చిన్న పాత్ర చేసినందుకు సంతోషం వ్యక్తపరుస్తున్నాడు విజయ్ దేవరకొండ. 



మరింత సమాచారం తెలుసుకోండి: