దగ్గుబాటి అభిరామ్ తో ఒకనటి సన్నిహితంగా ఉంటున్న ఫోటోలు ఈమధ్య బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ వివాదాల నుండి ఇంకా పూర్తిగా బయటకురాకుండానే అభిరామ్ కు మరో కొత్త బెదిరింపులు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అభిరామ్ సెల్ ఫోన్ ను తస్కరించిన నలుగురు దుండగులు ఆ సెల్ ఫోన్ లో ఉన్న ఫోటోలను బయటపెడతాము అంటూ అభిరామ్ ను బ్లాక్ మెయిల్ చేయడమే కాకుండా 1.5 కోట్లు చెల్లించమని లేకుంటే ఆ ఫోటోలను బయట పెడతాము అంటూ అభిరామ్ కు ఈమెయిల్ పెట్టి బెదిరించిన విషయం వెలుగులోకి వచ్చింది.
DAGGUBATI ABHIRAM LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనితో రంగంలోకి దిగిన తండ్రి సురేశ్ బాబు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం పై పోలీసులు లోతుగా విచారణ చేసి ఈబెదిరింపులను చేసిన నలుగురుని గుర్తించి అరెస్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే అభిరామ్ ఐ ఫోన్ లో ఏఫోటోలు ఏవీడియోల పేర్లు చెప్పి ఈ వ్యక్తులు బ్లాక్ మెయిల్ చేసారు అన్న విషయం పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారని ఒక ప్రముఖ తెలుగు దిన పత్రిక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. 
DAGGUBATI ABHIRAM LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
గతనెల 24వ తారీఖున ఒక ఫేక్ ఈమెయిల్ ఐడీని క్రియేట్ చేసి ఆ ఈమెయిల్ ఐడీ నుండి అభిరామ్ కు ఈబెదిరింపులు వచ్చినట్లు సమాచారం. అంతేకాదు ఆ ఐ ఫోన్ లో ఉన్న ఫోటోలు వీడియోల విషయం ప్రస్తావిస్తూ వాటిని సోషల్ మీడియాలో పెడతామని కూడ ఆ నలుగురు వ్యక్తులు అభిరామ్ ను బెదిరించినట్లు తెలుస్తోంది.
DAGGUBATI ABHIRAM LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
తెలుస్తున్న సమాచారం మేరకు అభిరామ్ ఒక రెస్టారెంట్ లో ఉన్న సమయంలో అతడి ఐ ఫోన్ ను తస్కరించిన దుండగులు ఆ ఫోన్ పాస్ వర్డ్ ను క్రాక్ చేసి అందులోని కొన్ని ఫోటోలు వీడియోలు ఆ దుండగులు చూసినట్లు తెలుస్తోంది. అయితే అభిరామ్ సెల్ ఫోన్ ను దొంగిలించిన వ్యక్తులు దొరికినా ఆ సెల్ ఫోన్ లోని ఫోటోలు వీడియోల పై ఇంకా గోప్యత కొనసాగుతూనే ఉంది అంటూ ఆ ప్రముఖ దిన పత్రిక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది..  



మరింత సమాచారం తెలుసుకోండి: