నిన్నటిరోజున విడుదలైన ‘మహానటి’ కి సూపర్ హిట్ టాక్ రావడంతో తెలుగుప్రేక్షకులు బయోపిక్ సినిమాలు కూడ చూస్తారు అన్ననమ్మకం పెరిగింది. అయితే ప్రేక్షకులను ధియేటర్స్ కు బయోపిక్ సినిమాల విషయంలో తీసుకురావడానికి ‘మహానటి’ మూవీ విషయంలో అనుసరించిన క్వాలిటీ మేకింగ్ ఉండాలి అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికితోడు బయోపిక్ మూవీలో చెప్పే కథ వాస్తవంగా ఉంటూ ఆబయోపిక్ లో నటులు కాకుండా వారు నటించే పాత్రలు మాత్రమే కనిపించాలి అన్న విశ్లేషణలు కూడ వినిపిస్తున్నాయి. 
MAHANATI MOVIE PHOTOS కోసం చిత్ర ఫలితం
‘మహానటి’ విజయంతో ఇప్పుడు అందరి దృష్టి రాబోతున్న రెండు బయోపిక్ సినిమాల పై ఉన్నాయి. అందులో ఒకటి ఎన్టీఆర్ బయోపిక్ అయితే మరొకటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ వైఎస్ జీవించిన కాలంలో చేసిన పాదయాత్ర మొదలై వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టడంతో ముగిస్తారు. అయితే మమ్ముట్టి వైఎస్ పాత్రలో నటిస్తున్నాడు కాబట్టి కొంతవరకు ఈసినిమాతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే అవకాసం ఉంది. అయితే ఇప్పటికే ప్రారంభం అయిన ఎన్టీఆర్ బయోపిక్ విషయం వేరు. 
NTR BIO PIC LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
కోట్లాది తెలుగుప్రజల హృదయాలలో ఇప్పటికీ ఆరాధ్య దైవంగా అభిమానులు కలిగి ఉన్న ఎన్టీఆర్ బయోపిక్ పై అత్యంత భారీఅంచనాలు ఉన్నాయి. నందమూరి తారకరామారావు చిన్ననాటి నుండి విశ్వవిఖ్యాత నటసార్వభౌముడుగా ఖ్యాతిని సంపాదించుకుని ఆతరువాత రాజకీయాలలో ‘రారాజుగా’ ఏలిన ఎన్టీఆర్ జీవితంలో అనేక ఆసక్తికర సంఘటనలు ఉన్నాయి. అయితే అవేమి చూపించకుండా కేవలం ఎన్టీఆర్ నటించిన కొన్ని పురాణ సాంఘీక పాత్రలను సుమారు 50 గెటప్ లతో బాలకృష్ణ నటించి చూపెడితే ఎన్టీఆర్ బయోపిక్ కు ఎక్కడ న్యాయం జరుగుతుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
NTR BIO PIC LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనికితోడు దర్శకుడు తేజ ఈప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం రాఘవేంద్రరావు లాంటి గొప్ప దర్శకులు ఈబయోపిక్ ను తీయలేము అంటూ చేతులెత్తేసిన పరిస్థుతులలో బాలకృష్ణ ఈబయోపిక్ కు దర్శకత్వం వహిస్తే కేవలం సరదా తీర్చుకోవడం జరుగుతుంది కానీ ఎన్టీఆర్ బయోపిక్ ను నిజయితీగా తీసిన పేరు బాలకృష్ణకు రాదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో క్రిష్ లాంటి దర్శకుడుకి ఈమూవీ దర్శకత్వ బాధ్యతలను అప్పగించి స్వేచ్చగా ఎన్టీఆర్ బయోపిక్ ను తీయగల అవకాసం బాలకృష్ణ కలగచేసినప్పుడు మాత్రమే అది ఒకచరిత్ర సృష్టించే బయోపిక్ గా మారుతుందని లేదంటే ఒక డాక్యుమెంటరీగా మారిపోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరిఇప్పుడు బాలయ్యకు ఈస్థాయిలో సరైన సలహాలు ఇవ్వగల వ్యక్తి ఎవరు అన్నది సమాధానం లేని ప్రశ్న.. 


మరింత సమాచారం తెలుసుకోండి: