రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కాలా' మూవీ ఆడియో వేడుక చెన్నైలో గత కొన్నేళ్లుగా రజనీకాంత్ సినిమాలకు సంబంధించిన సినిమా ఫంక్షన్లు వివిధ కారణాలతో భారీ ఎత్తున జరుగలేదు. చాలా కాలం తర్వాత ఈ సారి 'కాలా' ఆడియో వేడుక భారీ ఎత్తున నిర్వహించారు ఈ చిత్ర నిర్మాత ధనుష్. ఈ వేడుకకు సినీ ప్రముఖులతో పాటు వేలాది మంది అభిమానులు హాజరయ్యారు. ఈ వేడుకలో అభిమానుల ఉద్దేశించి రజనీకాంత్ సుధీర్ఘ ప్రసంగం ఇచ్చారు.  “ఈ గుర్రం ఇంకా పరుగులు పెడుతోందేమిటి అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

వాస్తవానికి నేను పరుగులేమీ పెట్టడం లేదు. నడుస్తున్నానంతే. ఆ దేవుడే నడిపిస్తున్నాడు. అందువల్లే ఎవరేమి చెప్పినా నా దారిలో నేను వెళుతుంటాను” అని వ్యాఖ్యానించారు. ‘కబాలీ’ సినిమా తరువాత మరో చిత్రం కోసం చాలామంది దర్శకులను అడిగానని, చివరకు రంజిత్ గుర్తుకు వచ్చి, ముంబైలోని దారావీ గురించి ఓ కథను సిద్ధం చేయాలని కోరితే, మూడు నెలల్లోనే కథను తయారు చేసి తీసుకు వచ్చారని అన్నారు.  ఈ చిత్రం అందరం మనసు పెట్టి చేశామని..ఒక మాస్ నాయకుడు ఎలా ఉండబోతున్నారన్న విషయం చక్కగా చూపించారని అన్నారు. 
ఈ వయసులో రొమాన్స్ చేయాలనుకోవడం లేదు
ఇక యంతిరన్(రోబో) సినిమా సమయంలో నా ఆరోగ్యం బాగోలేక పోవడం వల్ల ఆసక్సెస్ మీట్ సెలబ్రేట్ చేసుకోలేక పోయాం. నీ మనసును, బాడీ హెల్దీగా ఉంచుకుంటే త్వరలోనే కోలుకుంటావు అని అపుడు కొందరు చెప్పారు. కానీ నాకు యాక్టింగ్ తప్ప మరేమీ దెలియదు అని వారికి చెప్పాను.... అని రజనీ వ్యాఖ్యానించారు. యంతిరన్(రోబో) సినిమా సమయంలో నా ఆరోగ్యం బాగోలేక పోవడం వల్ల ఆసక్సెస్ మీట్ సెలబ్రేట్ చేసుకోలేక పోయాం.
నాకు యాక్టింగ్ తప్ప మరేమీ తెలియదు
నీ మనసును, బాడీ హెల్దీగా ఉంచుకుంటే త్వరలోనే కోలుకుంటావు అని అపుడు కొందరు చెప్పారు. కానీ నాకు యాక్టింగ్ తప్ప మరేమీ దెలియదు అని వారికి చెప్పాను.... అని రజనీ వ్యాఖ్యానించారు.  ఇది ఆడియో ఫంక్షన్ మాదిరి లేదు. మీ అందరినీ చూస్తుందే ఇది సక్సెస్ మీట్ లా అనిపిస్తోంది. యంతిరన్(రోబో) సినిమా సమయంలో నా ఆరోగ్యం బాగోలేక పోవడం వల్ల ఆసక్సెస్ మీట్ సెలబ్రేట్ చేసుకోలేక పోయాం. నీ మనసును, బాడీ హెల్దీగా ఉంచుకుంటే త్వరలోనే కోలుకుంటావు అని అపుడు కొందరు చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: