బయోపిక్..ఇలాంటి ఒక సినిమా నిర్మించాలంటే ఒక గట్స్ ఉండాలి అంతకంటే మించి ఆ బయోపిక్ ఒక తెలిసిన ముఖానిదయి ఉండాలి. అందులోనూ ఒక మహిళ యొక్క బయోపిక్ అంటే అందుకు తగ్గ నటులు కూడా అవసరమే. నాగ్ అశ్విన్ కు సరైన నటులు దొరకడం, గట్స్ ఉండడంతోటే అలనాటి మహానటి సావిత్రి జీవిత చరిత్రపై నిర్మించిన మహానటి సినిమా ప్రేక్షకుల ప్రజాదరణను పొందుతుంది.


సామాన్యుడు నుండి సెలెబ్రిటీల వరకు ఈ సినిమాను పొగడకుండా ఉండలేకపోతున్నారు. అయితే వీటన్నిటిలోకెల్లా  ఈ రోజు మధ్యాహ్నం నాగార్జున ట్వీట్ ప్రత్యేకంగా నిలిచింది. ఈ చిత్రంలో స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్రను నాగచైతన్య పోషిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చైతన్య పోషించిన తీరుపై నాగార్జున ట్విట్టర్లో విభిన్నంగా స్పందించారు.


"ఈ  రోజు నేను తండ్రిగా గర్వపడుతున్నా,  కొడుకుగా ఈర్ష్య పడుతున్నా. ఎందుకంటే నేను ఎప్పుడు నా తండ్రి అయిన లెజెండరీ  నటులు అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నటించలేదు. కానీ ఈ రోజు నాగచైతన్య ఆ పాత్రలో నటించినందుకు ఉద్వేగభరితంగా  ఉంది" అంటూ తన ట్విట్టర్ అకౌంట్లో మహానటి సినిమాలో చైతూ పాత్రను పరిచయం చేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: