తెలుగులో బిగ్ బాస్ రియాలిటీ షో మొదటి సీజన్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేసిన సంగతి తెలిసిందే. అసలు ఏమాత్రం తెలుగు ప్రేక్షకులకు అలవాటు లేని ఈ షోని అంత సక్సెస్ అయ్యేలా చేయడంలో తారక రాముడి పాత్ర చాలానే ఉంది. అయితే ఇక బిగ్ బాస్ సీజన్-2 కి రంగం సిద్ధమైంది.


కొన్నాళ్లుగా సీజన్ 2 ఎవరు హోస్ట్ చేస్తారా అన్న విషయం మీద క్లారిటీ వచ్చింది. అనుకున్నట్టుగానే కొన్నాళ్లుగా వార్తల్లో ఉన్న నాచురల్ స్టార్ నానినే బిగ్ బాస్ సీజన్-2 హోస్ట్ గా చేస్తున్నాడు. తన నాచురల్ నటనతో ప్రేక్షకుల మనసులను గెలుస్తున్న నాని బిగ్ బాస్ సీజన్-2 హోస్ట్ గా పెద్ద బాధ్యతనే నెత్తిన పెట్టుకున్నాడు.


బిగ్ బాస్ వన్ యంగ్ టైగర్ తన వాక్ చాతుర్యంతో బుల్లితెర మీద కూడా స్టార్ రేంజ్ ఏంటన్నది చూపించాడు. ఇక ఇప్పుడు నాని వంతు వచ్చింది. అయితే ఈ సీజన్ లో కంటెస్టంట్స్ కూడా నిత్యం వివాదాల్లో ఉన్న వారిని తీసుకుంటున్నారట. శ్రీరెడ్డి, మాధవిలత, టి.ఎన్.ఆర్ లతో పాటుగా రష్మి లాంటి యాంకర్స్ కూడా ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌజ్ కు వెళ్తున్నారని తెలుస్తుంది. 


మరి ఈ సీజన్ ఎలా ఉండబోతుంది. శ్రీరెడ్డి లాంటి వారిని బిగ్ బాస్ లోకి తీసుకెళ్తే ఏమవుతుంది అన్నది వేచి చూడాలి. ఏది ఎలా ఉన్నా బిగ్ బాస్ సీజన్-2 నాని మార్క్ ఎంటర్టైనింగ్ ఇస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నా ఫ్యాన్సీ ఆఫర్ రావడంతో నాని ఒప్పుకోకతప్పలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: