కొరటాల శివ ఇప్పుడు ఈ పేరు బ్లాక్ బస్టర్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. తాను తీసిన నాలుగు సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. దీనితో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరి పోయాడు. ఇప్పుడు కొరటాల సినిమా కు మార్కెట్ లో మినీమమ్ వంద కోట్ల మార్కెట్ ఉందని చెప్పవచ్చు. అయితే కొరటాల తరువాత సినిమా మెగా స్టార్ తో ఉండ బోతుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొరటాల తో మెగా స్టార్ మాట్లాడినాడని టాక్.

Image result for chiranjeevi and koratala siva

చిరంజీవి, బోయపాటి కాంబోలో సినిమా చాన్నాళ్ల కిందటే ఫిక్స్ అయింది. సైరా పూర్తయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాలని భావిస్తున్నాడట చిరంజీవి. అలా అని బోయపాటిని పూర్తిగా పక్కనపెట్టినట్టు కాదు. అతడితో కూడా సినిమా ఉంటుంది కానీ ఎప్పుడనేది చెప్పలేం. నిజానికి ఈ లిస్ట్ లో త్రివిక్రమ్ కూడా ఉన్నాడు. చిరంజీవి-త్రివిక్రమ్ కాంబినేషన్ కూడా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనేది చెప్పలేం.

Image result for chiranjeevi and koratala siva

అటు రామ్ చరణ్ తో కూడా ఓ సినిమాకు కమిట్ అయ్యాడు కొరటాల. అన్నీ అనుకున్నట్టు జరిగితే బ్యాక్ టు బ్యాక్ తండ్రికొడుకుల్ని డైరక్ట్ చేయబోతున్నాడు. సురేందర్ రెడ్డి విషయంలో కూడా ఇదే జరిగింది. చరణ్ తో ధృవ సినిమా చేసిన వెంటనే, చిరుతో సైరా చేస్తున్నాడు. ఏదేమైనా మెగాస్టార్ తో మూవీ కోసం బోయపాటికి సుదీర్ఘ నిరీక్షణ తప్పదేమో.



మరింత సమాచారం తెలుసుకోండి: