‘నాపేరు సూర్య’ థాంక్స్ మీట్ లో పవన్ అల్లు అర్జున్ లు వ్యవహరించిన తీరు పై ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. ఈ ఫంక్షన్ కు అతిధిగా వచ్చిన పవన్ చాల పొడిపొడిగా మాట్లాడటమే కాకుండా కేవలం మూడు నిముషాలలో తన ఉపన్యాసాన్ని ముగించడంతో పవన్ ఈ ఫంక్షన్ కు కేవలం మొహమాటానికి వచ్చాడా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

దీనికితోడు పవన్ తన ఉపన్యాసంలో అల్లు అర్జున్ ను గౌరవిస్తూ ‘అల్లు అర్జున్ గారు’ అంటూ పదేపదే గౌరవించడం మరింత ఆశ్చర్యపరిచింది. దీనికి ప్రతిగా అల్లు అర్జున్ కూడ ‘పవన్ కళ్యాణ్ గారు’ అంటూ తన స్పందన తెలియచేసాడు.

దీనితో ఆ ఫంక్షన్ కు వచ్చిన చాలామంది మళ్ళీ వీరిద్ధరి మధ్య ఏమైంది అంటూ ఆశ్చర్య పోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే సందర్భంలో పవన్ బన్నీ గురించి ఎక్కువగా మాట్లాడకుండా అల్లు అర్జున్ తాతగారు అల్లు రామలింగయ్య గురించి ఎక్కువ మాట్లాడటం ఈకార్యక్రమంలోని ట్విస్ట్. 

ఇదే కార్యక్రమంలో పవన్ తన అన్న నాగబాబు పై ఒక సెటైర్ కూడ వేసాడు. ‘నా పేరు సూర్య’ సినిమాకు నిర్మాతల్లో నాగబాబు ఒకరు అన్న విషయం తనకు ఇప్పుడే తెలిసింది అంటూ తనకు ఏమి చెప్పకుండా నాగబాబు అన్నీ చేసేస్తున్నాడు అంటూ మెగా బ్రదర్ పై జోక్ వేసాడు పవన్. అంతేకాదు తాను ఇంకా ‘నాపేరు సూర్య’ సినిమాను చూడలేదని తన రాజకీయ బస్సు యాత్ర ప్రారంభించేలోగా తాను ‘సూర్య’ సినిమాను చూస్తాను అంటూ మరొక ట్విస్ట్ ఇచ్చాడు పవన్. దీనితో ‘సూర్య’ థాంక్స్ మీట్ లో పవన్ అల్లు అర్జున్ లు చిందించిన నవ్వులు సహజ సిద్ధమైనవేనా లేదా అంటూ చర్చలు జరుగుతున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: