మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ మొదటి చిత్రం పెద్దగా విజయం కాకున్నా..పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘దేశముదురు’ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన ఆర్యా, బన్ని చిత్రాలతో మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. డ్యాన్స్, ఫైట్స్ లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న బన్ని స్టైలిష్ స్టార్ గా ఎదిగారు.  ఇక బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ‘సరైనోడు’ చిత్రం నుంచి వరుసగా విజయాలు అందుకుంటున్న బన్ని ఈ మద్య వక్కంతం వంశి దర్శకత్వంలో ‘నా పేరు సూర్య’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 
Image result for Naa Peru Surya posters
దేశభక్తి కి సంబంధించిన చిత్రంగా ప్రేక్షకాదరణ పొందింది.  కమర్షియల్ గా విజయం సాధించిన ‘నా పేరు సూర్య’ కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి.  ఓ వైపు రాంచరణ్ ‘రంగస్థలం’, మహేష్ బాబు ‘భరత్ అనే నేనూ’ చిత్రాలతో పోటీ పడుతూ కలెక్షన్లు సాధిస్తుంది.  ఈ చిత్రంలో బన్నీ యాక్షన్ .. ఎమోషన్స్ లోనే కాదు, ఎప్పటిలానే డాన్సుల్లోను ఆయన ఎక్కువ మార్కులు కొట్టేశాడు.
Image result for Naa Peru Surya posters
కథాకథనాలతో పాటు డాన్సుల్లోను ప్రత్యేకత వుండాలని ఆరాటపడే ఆయన, 'లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో' అనే పాటలో క్యాప్ తో కొన్ని విన్యాసాలు చేశాడు. చూడటానికి గమ్మత్తుగా అనిపించే ఆ విన్యాసాలు ఆయన ఫ్యాన్స్ ను మరింత ఖుషీ చేశాయి.  మొదట క్యాప్ తో చేసే ట్రిక్స్ గ్రాఫిక్స్ తో చేయిద్దామని దర్శకులు వంశి చెప్పినా.. బన్నీ రెండు నెలల పాటు ప్రాక్టీస్ చేసి .. ఆ పాటలో చేశాడట.
Image result for Naa Peru Surya cap
ఇదే విషయాన్ని దర్శకుడు వక్కంతం వంశీ కూడా ఈ సినిమా ఫంక్షన్ లో చెప్పాడు. క్యాప్ తో బన్నీ ప్రాక్టీస్ కి సంబంధించిన వీడియోను ఈ సినిమా విడుదలకి ముందే రిలీజ్ చేశారు. ఈ వీడియోను ఇంతవరకూ 25 లక్షల మందికి పైగా వీక్షించడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: