సామాన్యంగా సినిమాల ఆడియో ఫంక్షన్స్ లో దర్శకులు హీరోల భజన చేస్తూ ఉంటారు. అయితే రవితేజ ‘నేలటిక్కెట్టు’ ఆడియో ఫంక్షన్ లో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ నాగార్జునను దేవుడుగా మార్చి చేసిన కామెంట్స్ అందర్నీ ఆశ్చర్య పరిచాయి. ఈ ఫంక్షన్ లో కళ్యాణ్ కృష్ణ ముందుగా నాగార్జున ప్రస్తావన తీసుకు వస్తూ తనకు దర్శకుడుగా తొలి అవకాశం ఇచ్చిన నాగార్జున తన దృష్టిలో దేవుడనీ మనుషుల రూపంలో మాత్రమే దేవుడు మనకు సహాయపడుతూ ఉంటాడు అంటూ కళ్యాణ్ కృష్ణ తనకు నాగ్ పై ఉన్న అభిమానాన్ని బహిరంగంగా బయట పెట్టాడు.
ఆయన సపోర్ట్‌తోనే
ఇదే సందర్భంలో ఈ యంగ్ డైరెక్టర్ మాట్లాడుతూ తనకు రవితేజాతో వ్యక్తిగత పరిచయం పెద్దగా లేకపోయినా తాను దర్శకుడు హరీష్ శంకర్ ద్వారా రవితేజాను కలిసి తాను ‘నెలటిక్కెట్టు’ కథను వినిపించిన విషయాన్ని వివరిస్తూ మాస్ మహారాజ తనకు ఈసినిమా విషయంలో అందించిన సహకారం తాను ఎప్పటికీ మరిచిపోను అంటూ మరొక ట్విస్ట్ ఇచ్చాడు కళ్యాణ్ కృష్ణ. ఈ దర్శకుడు ఇప్పటి వరకు తీసిన రెండు సినిమాలు విజయవంతం కావడంతో ‘నేలటిక్కెట్టు’ పై కూడ అంచనాలు బాగా పెరుగుతున్నాయి. 
వాడుకోకుండా వదలడు
ఇదే ఫంక్షన్ లో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ రవితేజాను పక్కకు పెట్టి ఎక్కువగా పవన్ ను ప్రశంసిస్తూ మాట్లాడటం మరొక హాట్ న్యూస్. దేవుడు ఎవరికైనా పవర్ ఇచ్చాడంటే దానిని వాడుకోకుండా వదలడు అని అంటూ తనకు సరిగ్గా 6 సంవత్సరాల క్రితం దర్శకుడుగా తన కెరియర్ కు ట్విస్ట్ ఇచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమాలో నటించి తనకు లైఫ్ ఇచ్చిన పవన్ కు తాను ఎప్పుడు రుణపడి ఉంటాను అని కామెంట్ చేసాడు హరీష్ శంకర్. 
హరీష్ శంకర్ ద్వారా
దీనితో కళ్యాణ్ కృష్ణ హరీష్ శంకర్ లు ‘నేలటిక్కెట్టు’ ఫంక్షన్ లో రవితేజా పై తక్కువ మాట్లాడుతూ నాగార్జున పవన్ ల గురించి ఎక్కువగా మాట్లాడటం హాట్ న్యూస్ గా మారింది. ఈ సమ్మర్ రేస్ కు వచ్చిన టాప్ హీరోల సినిమాలు అన్నీ భారీ ఓపెనింగ్స్ సాధించిన నేపధ్యంలో ఈమూవీ ప్రస్తుతం డల్ గా ఉన్న రవితేజా కెరియర్ కు ఒక ఊహించని ట్విస్ట్ ఇస్తుందని మాస్ మహారాజ అభిమానులు గంపెడు ఆశతో ఎదురు చూస్తున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: