catherine tresa new movies కోసం చిత్ర ఫలితం
టాలీవుడ్ లో అన్నీ అర్హతలుండీ నిజంగా చెప్పాలంటే బలైపోయిన బ్రైట్ & హాట్‌ బ్యూటీ కేథరీన్‌ ట్రెసా కి మెగా కాంపౌండ్ హీరో అయిన అల్లు అర్జున్ తో మంచి స్నేహం ఉంది. ఆ స్నేహం తోనే కేథరీన్‌ కి చాలా అవకాశాలిప్పించాడు బన్నీ. హీరోయిన్‌ గా ఉండాల్సిన అన్ని క్వాలిటీస్‌ అసెట్స్ తో పాటు మంచినటన ప్రదర్శించగల సామర్ధ్యం ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ సెకండ్‌ హీరోయిన్‌ గానూ, 'ఐటెంగాళ్‌' గానే సరిపెట్టు కోవలసిన పరిస్థితులు ఆమెకు వరసగా వస్తున్నాయి. 

catherine tresa new movies with mega heroes కోసం చిత్ర ఫలితం

చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. అన్నీ జనం గుర్తుంచుకోవలసిన క్యారెక్టర్సే. అయితే ఆమెకు ప్రతిష్ట తెచ్చే చెప్పుకోదగ్గ ఫుల్‌-లెంగ్త్‌ క్యారెక్టర్‌ ఒక్కటీ రాలేదనే చెప్పాలి. ఐతే బోయపాటి సీను డైరెక్ట్ చేసిన సరైనోడులో ఎమెల్యే పాత్రలో నటించి ఒక ఊపినా ఆమె టైం బాగలేదు కాబట్టే మంచి మంచి అవకాశాలు రాలేదనే చెప్పాలి. అయితే బోయపాటి అస్థానంలో ఈమెకు శాశ్వత స్థానమే ఉంది. బహుశ, బోయపాటి సెంటిమెంట్ కావచ్చు తాజాగా కేథరీన్‌ పేరు బోయపాటి సినిమా కోసం వినిపిస్తోంది.

catherine tresa new movies with mega heroes కోసం చిత్ర ఫలితం
బోయపాటి కి కూడా కేథరీన్‌ ఆస్థాన కళాకారిణే. తన సినిమాలో ఐటెంసాంగ్‌ కావచ్చు. కథని మలుపు తిప్పే కీలక పాత్ర అయినా కావచ్చు.  కథకి  "కీ"  క్యారెక్టర్‌ లో కేథరీన్‌ ను ఇష్టంగా ఫిక్స్‌ చేస్తాడు బోయపాటి.  నిజంగానే ఆ పాత్రకి తన అందాలతో భారీతనాన్ని తీసుకొస్తుందీ ముద్దుగుమ్మ కూడా. అందుకే బోయపాటి తన తాజా చిత్రంలో కేథరీన్‌ కోసం ఒక క్యారెక్టర్‌ని ఇప్పటికే డిజైన్‌ చేసి ఉంచాడని సమాచారముంది.  
సంబంధిత చిత్రం
బోయపాటి  శీను, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కలయికలో  'రాజవంశస్థుడు'  అనే టైటిల్‌ తో ఒక సినిమా రూపొందుతోంది. దీనికి కేథరీన్ ట్రెసా ని పరిశీలిస్తున్నారు. ఈ సినిమా లో మెగా పవర్‌ స్టార్‌తో "భరత్‌ ......"  బ్యూటీ కైరా అద్వానీ జతకడుతుండగా, మరో ముఖ్యమైన పాత్రకు కేథరీన్‌ ని ఫైనల్ చేసుకునే ఆలోచనలో బోయపాటి శీను ఉన్నట్లు తెలుస్తోంది. 

అంతేకాదు, కేథరీన్‌ కి చరణ్‌ తో ఒక స్పెషల్‌ సాంగ్‌ కూడా ప్లాన్‌ చేస్తున్నారట. చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ 150'లో కేథరీన్‌ ఒక 'ఐటెంసాంగ్‌' చేయాల్సి ఉండగా లాస్ట్‌ మినిట్‌ లో ఆ ఆఫర్‌ ని లక్ష్మీ రాయ్‌ తన్నుకెళ్లిపోయింది, అదీ చిరంజీవి కూతురుతో ఏర్పడ్డ మనస్పర్ధ వలననేనట. అలా అప్పుడు కోల్పోయిన ఆ అవకాశం ఇప్పుడు మళ్లీ చరణ్ సినిమా ద్వారా  కేథరీన్‌ దక్కించు కుంటుందేమో? చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: