సావిత్రి బయోపిక్ గా మహానటి సినిమా మే 9న రిలీజ్ అయ్యి అశేష ప్రేక్షకాదరణ పొందుతుంది. ఎవడే సుబ్రమణ్యం తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను స్వప్నా దత్, ప్రియాంకా దత్ లు నిర్మించారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించి మెప్పించారు. అంతేకాదు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ జెమిని గణేషన్ పాత్రలో అదరగొట్టాడు.


ఈ సినిమాకు వస్తున్న ప్రేక్షకాదరణతో పాటుగా సెలబ్రిటీస్ కాంప్లిమెంట్స్ సంచలనంగా మారుతున్నాయి. నాని సావిత్రి పాత్రకు కీర్తి తర్వాత సావిత్రి గారే ఇక మరెవరు అలా చేయలేరని అంటే. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఏకంగా సావిత్రి గారే కీర్తితో అలా చేయించి ఉంటారని ట్వీట్ చేశారు.


ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నందుకు ఇండస్ట్రీ అంతా హ్యాపీగా ఉంది. అయితే ఈ సినిమాలో కాజల్ కూడా ఉన్నదని రిలీజ్ ముందు దర్శక నిర్మాతలు ప్రస్థావించారు. మరి సినిమా వచ్చింది సూపర్ హిట్ అయ్యింది. కాజల్ మాత్రం ఎక్కడ కనిపించలేదు. మహానటిలో కాజల్ కు ఎక్కడ స్కోప్ ఇచ్చినట్టు తెలియలేదు.


సినిమా ఎలాగు హిట్ అయ్యింది కాబట్టి ఈ విషయం గురించి ఎవరు మాట్లాడట్లేదు. మరి నాగ్ అశ్విన్ కాజల్ ను ఎక్కడ చూపించాలనుకున్నారు. అసలు మహానటికి కాజల్ కు సంబంధం ఏంటి అన్నది చిత్రయూనిట్ రెస్పాండ్ అయితేనే తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: