టాలీవుడ్ ఇండస్ట్రీ ఛార్మింగ్ కపుల్ గా అందరి దృష్టిని ఆకర్షించే చరణ్ ఉపాసనలకు సంబంధించిన వార్తలు ఎప్పుడూ మీడియాలో హాట్ టాపిక్. అయితే ఉపాసన ఫోన్ పై చరణ్ చెక్ పెడతాడు అంటే ఎవరు నమ్మరు. అయితే ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణ్ ఒక మీడియా ఇంటర్వ్యూలో బయటపెట్టడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. 
UPASANA ALONG WITH RAM CHARAN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
రామ్ చరణ్ అప్పుడప్పుడు తన భార్య ఉపాసన మొబైల్ చెక్ చేస్తుంటాడట. అంతేకాదు ఉపాసన ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ ను ఓపెన్ చేసి ఆమె పెట్టె పోస్టింగ్ లు అన్నీ పరిశీలించడమే కాకుండా వాటి పై వచ్చే కామెంట్స్ ను కూడ తాను ఉపాసనకు తెలియకుండా ఫాలో అవుతూ ఉంటాను అన్న విషయాన్ని బయటపెట్టాడు చరణ్.
UPASANA ALONG WITH RAM CHARAN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అంతేకాదు తన గురించి తనకు తెలియకుండా ఉపాసన బయటపెట్టె సీక్రెట్స్ గురించి వచ్చే కామెంట్స్ చాల శ్రద్ధగా పరిశీలిస్తాను అని అంటున్నాడు చరణ్. 
అయితే ఉపాసన తనను సోషల్ మీడియాలోకి రమ్మని చేస్తున్న ఒత్తిడి రోజురోజుకు పెరిగి పోతోంది అంటూ సోషల్ మీడియాలోకి వచ్చే విషయమై తనకు కొన్ని సమస్యలు ఉన్న విషయాన్ని బయటపెట్టాడు చరణ్. సోషల్ మీడియాలో ఉంటే ప్రతి విషయం పైన స్పందించవలసి ఉంటుందని ఆ విషయాల పై స్పందిస్తే ఒక సమస్య స్పందించకపోతే మరొక సమస్యా ఉంటుంది కాబట్టి తాను సోషల్ మీడియా నుంచి తప్పుకున్న విషయాన్ని తెలియచేసాడు చరణ్. 
UPASANA ALONG WITH RAM CHARAN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే మారిన పరిస్థితులలో ఉపాసన ఒత్తిడి వల్ల తాను సోషల్ మీడియాలోకి తిరిగి రీ ఎంట్రీ ఇచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అంటూ ఒక మంచిరోజు చూసుకుని వల్ల ఇన్ స్టాగ్రామ్ లో తన ఎకౌంట్ ఓపెన్ చేయబోతున్నట్లు లీకులు ఇస్తున్నాడు చరణ్. దీనితో ఇప్పటికే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఉపాసన సపోర్ట్ తో రానున్న రోజులలో చరణ్ సోషల్ మీడియా కింగ్ గా మారినా ఆశ్చర్యం లేదు అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: