ఈసమ్మర్ రేస్ కు వచ్చిన ‘నాపేరు సూర్య’ బ్లాక్ బస్టర్ హిట్ కావడం అటుంచి కనీసం యావరేజ్ మూవీగా కూడ గట్టెక్కలేకపోవడంతో అల్లు అర్జున్ ను అంతర్మధనంలోకి నెట్టేసింది. సామాన్యంగా బన్నీ కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడు. గతంలో ‘ఆర్య’ సినిమాలో సుకుమార్ కు అవకాశం ఇచ్చిన తరువాత చాలకాలం తరువాత కొత్త దర్శకుడు అయిన వక్కంతం వంశీతో ‘సూర్య’ ప్రయోగానికి ఒప్పుకున్నాడు బన్నీ. 
VAKKANTHAM VAMSI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే బన్నీ వక్కంతం వంశీతో ఈప్రయోగం చేయడానికి ఒప్పుకోవడం వెనుక దర్శకుడు సుకుమార్ సలహా ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. వక్కంతం వంశీ అల్లు అర్జున్ కు ఎంతో ఉద్వేగభరితంగా ‘సూర్య’ కథను చెప్పినప్పటికీ అంత ఉద్వేగభరితంగా ఆసినిమాను వంశీ తీయగలడా అన్న అనుమానాలు బన్నీకి ఏర్పడ్డాయట. 
SUKUMAR LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే ఈవిషయాలను గ్రహించిన సుకుమార్ బన్నీకి ఫోన్ చేసి వక్కంతం ప్రతిభ పై అనుమానాలు పెట్టుకోవద్దని అవసరం అయితే సూర్య మూవీ సన్నివేశాల చిత్రీకరణలో తాను వక్కంతంకు సహాయపడతాను అని మాట ఇచ్చాడట. అయితే ఆతరువాత సుకుమార్ తన ‘రంగస్థలం’ మూవీ వ్యవహారాలలో బిజీగా ఉండటంతో అటు బన్నీ కాని ఇటు వక్కంతం కాని ‘సూర్య’ సినిమా విషయంలో సుకుమార్ ను ఎటువంటి సలహాలను అడగలేదని తెలుస్తోంది. 
NAA PERU SURYA MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇప్పుడు ‘నాపేరు సూర్య’ భయంకరమైన ఫ్లాప్ గా మారడంతో సుకుమార్ సలహాలను తాను అడిగి ఉంటే బాగుండేది అని బన్నీ బాధ పడుతున్నట్లు టాక్. ఈమూవీ రిజల్ట్ తేడా రావడంతో అల్లు అర్జున్ తాను తదుపరి నటించబోయే సినిమాల దర్శకుల ఎంపికలో చాల ఆచితూచి వ్యవహరించాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘సూర్య’ పరాజయం బన్నీకి జ్ఞానోదయం అనుకోవాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: