మహానటి సినిమా సక్సెస్ అయిన కారణం చేత ఆ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా సినిమా యూనిట్ అందరిని ప్రశంసిస్తూ ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. సావిత్రి బయోపిక్ మహానటి ఎవరు ఊహించిన విధంగా తీసి సక్సెస్ సాధించినందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ కు తన శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి.


సినిమాలో నటించిన వారందరి గురించి కూడా ప్రస్థావించాడు. అయితే జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా అశ్వనిదత్ నిర్మాతగా కె.రాఘవేంద్ర రావు డైరక్షన్ లో వచ్చింది. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా అది. 


మహానటి సక్సెస్ తో దర్శకుడు నాగ్ అశ్విన్ మీద నమ్మకం పెరిగింది. అందుకే నాగ్ అశ్విన్ డైరక్షన్ లో అశ్వనిదత్ నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా తీయాలని చూస్తున్నారట. ఈ సినిమా పాతాలభైరవి టైపులో ఉంటుందని. టైం మిషన్ నేపథ్యంలో కథ సాగుతుందని అంటున్నారు.


చిరు కథ విని ఓకే చెబితే కథ రాసేందుకు ఓ సంవత్సరం గ్యాప్ తీసుకుని ఫైనల్ చేస్తారట. అశ్వనిదత్ తలచుకుంటే ఇక ఆ సినిమాకు తిరుగేముంటుంది. అప్పట్లో జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమానే ఎవరు ఊహించని రేంజ్ లో తీసి హిట్ కొట్టాడు. లేటెస్ట్ గా మహానటి కూడా వైజయంతి బ్యానర్ ప్రతిష్టతని పెంచింది. మరి మెగాస్టార్ తో నాగ్ అశ్విన్ సినిమా ఎలా ఉంటుందో అసలు ఉంటుందో లేదో చూడాలి.    



మరింత సమాచారం తెలుసుకోండి: