వెండితెర అపురూపదృశ్యకావ్యం మహానటి జీవిత చరిత్ర గా వచ్చిన మహానటి చిత్రం తెలుగు సినీ అభిమానుల మనసు గెలుచుకుంది. సావిత్రి   గురించి తెలియని ఎన్నో విషయాలను ఈ సినిమా ద్వారా ఈ తరం యువత తెలుసుకుంటున్నారు.  అంతే కాదు అప్పట్లో ఎన్నో రూమర్లు వచ్చాయి..వాటన్నింటిక క్లారిటీ కూడా ఇచ్చారు చిత్రయూనిట్.   మహానటి సావిత్రి అంటే ఏ జనరేషన్ కి అయిన నచ్చే హీరోయిన్.   ఆమె జీవిత కథ చిత్రం ‘మహానటి’ చిత్రం  చూసిన ప్రతి ఒక్కరికి ఎంతో సంతృప్తిని ఇచ్చింది.
Image result for MAHANATI
ఈ సినిమా విడుదల అవ్వకముందు అసలు సావిత్రి ఎందుకు చచ్చిపోయింది? కోమాలోకి ఎందుకు వెళ్ళింది? మందుకు ఎందుకు బానిస అయింది? అని అలా చాలా ప్రశ్నలు అందరిలోనూ ఉన్నాయి. కానీ, ఈ చిత్రం చూసిన తర్వాత ఆ అభిప్రాయాలన్నీ తొలగిపోయాయి.  ఈ సినిమా టీమ్ తెలుగు రాష్ట్రాలలో వుండే ప్రముఖులు కాక యావత్ సినీప్రపంచం మొత్తం ప్రశంసిస్తున్నారు.
Image result for MAHANATI
అలాంటివారి జాబితాలో తాజాగా ఎన్టీఆర్ కూడా చేరిపోయారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ నటనను గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. బహుశా సావిత్రి గారే ఆమెతో అలా చేయించారేమో. మంచి నటీనటులతో కలిసి దర్శకుడు నాగ్ అశ్విన్ చేసిన గొప్ప ప్రయోగం ఫలించింది అని అన్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ కి ఆయన అభినందనలు తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: