సావిత్రి జీవితం పై నాగ్ అశ్విన్ తీసిన ‘మహానటి’ సూపర్ హిట్ కావడంతో ఈమూవీకి కలక్షన్స్ తో పాటు అన్ని వర్గాల నుండి ప్రశంసలు కూడ అందుతున్నాయి. ఈనేపధ్యంలో ఈసినిమాను చూసిన మెగా స్టార్ చిరంజీవి దర్శకుడు నాగ్ అశ్విన్ ను అదేవిధంగా ఈ మూవీ నిర్మాతలు అశ్వినీ దత్ కుటుంబ సభ్యులను తన ఇంటికి పిలిచి సత్కరించాడు.
ఎలాంటి సంతృప్తి లభించింది
నాగ్ అశ్విన్ దర్శకత్వ ప్రతిభకు ముచ్చటపడ్డ చిరంజీవి అతడితో ఒక సినిమాను చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించడమే కాకుండా ‘మహానటి’ సినిమాకు సంబంధించి తనకు కలిగిన కొన్ని సందేహాలను చిరంజీవి ఓపెన్ గానే నాగ్ అశ్విన్ ను ఆ సత్కార కార్యక్రమంలో అడగడం ఆశ్చర్యాన్ని కలిగించింది. జీవిత చరమాంకంలో సావిత్రి వ్యసనాలకు లోనైన విషయం ‘మహానటి’ సినిమాలో చూపించడానికి ఆమె కుమార్తె విజయ చాముండేశ్వరి అభ్యంతరాలు చెప్పలేదా ? అని చిరంజీవి అడిగిన ప్రశ్నకు నాగ్ అశ్విన్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.
సావిత్రి బయోపిక్
సావిత్రి జీవితంలోని కొన్ని సంఘటనలను యదార్ధంగా తీయకుండా ఆసినిమాను నిర్మించడం అనవసరం అన్న విషయాన్ని చెప్పడమే కాకుండా సావిత్రి తన జీవితంలో వ్యసనాలకు లోనైన విషయం యదార్ధంగా చెపితే సావిత్రి పై సానుభూతి పెరుగుతుంది అన్నవిషయం సావిత్రి కుమార్తెకు అర్ధం అయ్యేలా తాను చెప్పానని నాగ్ అశ్విన్ తెలియ చేసాడు. ఈ అభిప్రాయానికి సావిత్రి కుమార్తె అంగీకరించడంతో తనకు ‘మహానటి’ మూవీ తియ్యడం తేలిక అయింది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు నాగ్ అశ్విన్. 
ఎలా ప్రారంభమైంది
ఇదే సందర్భంలో నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ఒక గొప్ప వ్యక్తి జీవితం పై బయోపిక్ తీసే అవకాసం ఒకేసారి వస్తుంది అని చెపుతూ అటువంటి సినిమాలను చాల నిజయితీగా తీయాలి అన్న అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు. సావిత్రి చనిపోయి ఎన్నోసంవత్సరాలు అయిపోయినా ఇంకా ఆమె నటించిన సినిమాలు అదేవిధంగా ఆసినిమాలలోని పాటలు ఇంకా బ్రతికే ఉన్న నేపధ్యంలో సావిత్రి బయోపిక్ కు జనం సులువుగా కనెక్ట్ అయ్యారు అన్న విషయాన్ని బయటపెడుతూ చిరంజీవి ‘మహానటి’ పై అడిగిన ఎన్నో ఆసక్తికర సందేహాలకు నాగ్ అశ్విన్ మరింత ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: