ప్రియా ప్రకాష్ వారియర్ ఒకే ఒక స్టిల్ తో సోషల్ మీడియా లో ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. ఈ అమ్మాయికి అందరు ఫిదా అయిపోయారు. అల్లుఅర్జున్ అయితే ఏకంగా తన గురించి ట్విట్టర్ లో రాసినాడు. అయితే ఈ బ్యూటీ కి ఆఫర్లు వెల్లువ వచ్చి పడుతున్నాయి. అందరి దర్శకుల కళ్ళు ఈ అమ్మడు మీద పడ్డాయి. తాజా గా సూర్య సినిమా లో నటించడానికి చిత్ర యూనిట్ తనని ఎంపిక చేశారంటా... అయితే సూర్య అందుకు ఒప్పుకోలేదంటా.

Image result for priya prakash warrior and surya

దీంతో ఆమెను త‌క్ష‌ణం ఆ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పించిన‌ట్లు స‌మాచారం. ప్రియ-సూర్య‌ల మ‌ధ్య వ‌య‌సు వ్య‌త్యాసం చాలా ఉంటుంది. సూర్య వ‌య‌సులో సగం ఉండొచ్చేమో! ఈ కార‌ణంతోనే ప్రియ‌ను టీమ్ త‌ప్పించిన‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. వాస్త‌వానికి ప్రియ‌ను ఎంపిక చేసిన‌ట్లు సూర్య‌కు ఆల‌స్యంగా తెలిసింద‌ట‌. త‌ను వేరే సినిమా ప‌నుల్లో విదేశాల‌కు వెళ్ల‌డంతో ఈ లోపే యూనిట్ ప్రియ‌ను ఫైనల్ చేసి అడ్వాన్స్ కూడా అందించారుట‌.

Image result for priya prakash warrior and surya

కానీ సూర్య చైన్నై కు రావ‌డంతో విషయం తారుమారైంది. నా వ‌య‌సేంటి? త‌న వ‌య‌సేంటి? క‌్రేజ్ ఉంద‌ని హీరోయిన్ గా ఎంపిక చేసేస్తారా? అని యూనిట్ పై సీరియ‌స్ అయిన‌ట్లు స‌మాచారం. మ‌రిప్పుడు ఆ స్థానంలో ఎవ‌ర్ని ఎంపిక చేస్తారో? ప్ర‌స్తుతం సూర్య సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో `ఎన్.జి.కె` అనే సినిమాలో న‌టిస్తున్నాడు. షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఇటీవ‌లే విదేశాల్లో కీల‌క షేడ్యూల్ ను చిత్రీక‌రించారు. ఇందులో సాయిప‌ల్ల‌వి, ర‌కుల్ ప్రీత్ సింగ్ నాయిక‌లుగా న‌టిస్తున్నారు. అన్ని ప‌నులు పూర్తిచేసి న‌వంబ‌ర్ లో చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ముహూర్తం ఫిక్స్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: