బోయ పాటి సినిమా లో ఐటెం సాంగ్స్ కు ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. ఐటెం సాంగ్స్  మాస్ ఆడియెన్స్ ను మెప్పించే విధంగా ఉంటాయి. అయితే అప్పుడప్పుడు హీరోకు మరియు డైరెక్టర్ మధ్య నటీ నటుల ఎంపిక విషయం లో భేదాభిప్రాయాలు వస్తుంటాయి. అయితే ఇప్పడూ కూడా చెర్రీకి మరియు బోయపాటికి ఐటెం సాంగ్ విషయంలో తేడా వచ్చింది. బోయ పాటి కేథరిన్ కు ఓటేస్తే కాహారం అందుకు ఒప్పుకోలేదు. కొత్త ముఖం అయితే బాగుంటుందని చరణ్ చెప్పాడు. 

Image result for boyapati srinu and charan

అందుకు బోయ‌పాటి నో చెప్పాడుట‌. ఎట్టి ప‌రిస్థితుల్లో కేథ‌రీన్ అయితేనే ఆ పాట‌కు సెట్ అవుతుంద‌ని ఒప్పించే ప్ర‌య‌త్నం చేసాడుట‌. దీంతో చెర్రీ రాజీ బేరానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.బోయ‌పాటి కేథ‌రీన్ ను తీసుకోవ‌డానికి కార‌ణం ఏంట‌న్న‌ది? మెగా అభిమానుల‌కు మాత్రం అంతు చిక్క‌ని ప్ర‌శ్న‌. `స‌రైనోడు` సినిమాతో కేథ‌రీన్ సెకెండ్ ఇన్నింగ్ మొద‌లైంది. అందులో అమ్మ‌డు ఎమ్మెల్యేగా బాగానే మెప్పించింది. ఆ సినిమా కూడా హిట్ అయింది.

Image result for boyapati srinu and charan

దీంతో ఆసెంట్ మెంట్ ను పున‌రావృతం చేద్దామ‌ని బోయ‌పాటి ఇలా ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే మెగాస్టార్ కంబ్యాక్ మూవీ `ఖైదీ నంబ‌ర్ 150`వ సినిమాలో ఐటం భామ‌గా ముందుగా కేథ‌రీన్ ను అనుకున్నారు. కానీ చివ‌రి నిమిషంలో ఛాన్స్ కోల్పోవాల్సి వ‌చ్చింది. అప్పుడా ఆ ఛాన్స్ మిస్ అయినా ఇప్పుడు అబ్బాయ్ తో రొమాన్స్ చేయ‌డం మాత్రం షురూ అయింది. అంతా బోయ‌పాటి చ‌ల‌వ‌.

మరింత సమాచారం తెలుసుకోండి: