ఓ పక్క సావిత్రి బయోపిక్ పై వచ్చిన మహానటి సినిమా సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతుంది. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వచ్చిన మహానటి సినిమాలో ప్రతి ఒక్క పాత్ర నటించడం కాదు జీవించేశారు అన్న విధంగా ప్రశంసలు వస్తున్నాయి. ఈ సినిమా హిట్ మిగతా బయోపిక్ ల మీద కూడా మరింత బాధ్యత పెంచేసింది.


ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న మరో క్రేజీ బయోపిక్ ఎన్.టి.ఆర్. బాలకృష్ణ హీరోగా తేజ డైరక్షన్ లో అట్టహాసంగా మొదలైన ఈ సినిమా నుండి తేజ తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఈగో క్లాషెస్ డైరక్టర్ గా తేజకు అక్కడ వెయిట్ లేదనే టాక్ వచ్చింది. అందుకే ఆయన సినిమా నుండి తప్పుకున్నాడని అన్నారు.


ఇటీవల విడుదలైన మహానటి సినిమా చూసిన తర్వాత తేజ మళ్లీ మనసు మార్చుకున్నాడని అంటున్నారు. బాలకృష్ణ ఇప్పటికి తేజ అయితేనే ఈ సినిమాకు న్యాయం చేయగలుగుతాడని నమ్మకంతో ఉండగా తేజ మరళ ఆలోచనలో పడ్డాడట. దానితో పాటుగా బయోపిక్ తీస్తే వచ్చే ఆ పేరుని దృష్టిలో పెట్టుకుని మళ్లీ ఎన్.టి.ఆర్ బయోపిక్ కు సరే అని చెప్పబోతున్నాడట. 


ఎలాగు తేజ ఎక్సిట్ చిత్రయూనిట్ ఎనౌన్స్ చేయలేదు కాబట్టి సైలెంట్ గా మళ్లీ షూటింగ్ కు వెళ్తే సరిపోతుందని అంటున్నారు. ఒకానొక దశలో బాలకృష్ణ ఎన్.టి.ఆర్ బయోపిక్ ఆపేస్తున్నాడన్న టాక్ రాగా తేజ రీ ఎంట్రీతో మళ్లీ ప్రాజెక్ట్ కు మరింత బలం వచ్చిందని అంటున్నారు. మరి మహానటి రేంజ్ లో ఎన్.టి.ఆర్ సినిమా ఉంటుందా లేదా అన్నది సినిమా వస్తేనే కాని చెప్పలేం. 



మరింత సమాచారం తెలుసుకోండి: