సావిత్రి మహానటి సినిమాపై తెలుగు తమిళనాట ప్రేక్షకులు నీరాజనాలు అందిస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వచ్చిన మహానటి సినిమాను స్వప్న సినిమాస్ బ్యానర్లో ప్రియాంకా దత్ నిర్మించారు. ఇక ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు కీర్తి, దుల్కర్ సల్మాన్ ల నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు.


ఇక ఈ సినిమా రిజల్ట్ ముందే అంచనా వేసిన నిర్మాత అశ్వనిదత్ సినిమా ముందే శాటిలైట్ ఆఫర్ వచ్చినా ఆఫ్టర్ రిలీజ్ అని చెప్పాడట. ఇప్పుడు మహానటి సినిమా టాలీవుడ్ సూపర్ క్లాసిక్ మూవీస్ లో ఒకటని అంటున్నారు. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం ఛానెల్స్ అన్ని పోటీ పడుతున్నాయి.


ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడిందని తెలుస్తుంది. జెమిని, స్టార్ మా, జీ తెలుగు మూడు ఛానెల్స్ ఒకరికంటే ఒకరు ఎక్కువ కోట్ చేసి ఈ సినిమాను దక్కించుకోవాలని చూస్తున్నారట. మరి ఈ మూడు ఛానెల్స్ లో మహానటి ఎవరి సొంతం అవుతుందో చూడాలి. దాదాపు ఓ స్టార్ హీరో సినిమా రేంజ్ శాటిలైట్ పలుకుతుందట మహానటి. 


మహానటి బాక్సాఫీస్ పై కూడా తన సత్తా చాటుతుంది. ఓ స్టార్ హీరో సినిమా కలెక్ట్ చేసిన విధంగా రోజు రోజుకి వసూళ్ల లెక్క పెరుగుతుంది. ఓవర్సీస్ లో అయితే ఇప్పటికే మిలియన్ డాలర్ క్లబ్ లో చేరి సంచలనం సృష్టించింది మహానటి. కచ్చితంగా అవార్డుల్లో కూడా ఈ సినిమా తన మార్క్ చూపిస్తుందని అంటున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: