‘మహానటి’ ఘన విజయం బాలకృష్ణ పై విపరీతమైన ఒత్తిడిని కలగ చేస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి. బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ ను ఎంతో ఘనం ప్రారంభించడంతో ఈమూవీ పై నందమూరి అభిమానులలోనే కాకుండా తెలుగుదేశం పార్టీ వర్గాలలో కూడ భారీ అంచనాలు పెరిగాయి. అయితే అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ నుంచి డైరెక్టర్ తేజ డ్రాప్ కావడం షాకింగ్ న్యూస్ గా మారడమే కాకుండా ఈమూవీ ప్రాజెక్ట్ కు శాపంగా మారింది. 
BALAKRISHNA NTR BIOPIC PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈసంఘటన జరిగిన తరువాత ఈ బయోపిక్ కు దర్శకత్వం వహించే విషయంలో  చాలామంది పేర్లు వినిపించాయి. కానీ ఇప్పటివరకు అఫీషియల్‌గా ఎలాంటి ధృవీకరణ రాలేదు. ఒకానొక దశలో బాలకృష్ణ డైరెక్టర్ చేస్తారన్నవార్తలు కూడ వచ్చాయి. అయితే ఎంతో కష్టమైన దర్శకత్వ భాద్యతను తలకెత్తుకోవద్దని బాలయ్య సన్నిహితులు లేటెస్ట్ గా సలహాలు ఇస్తున్నట్లు సమాచారం.
సంబంధిత చిత్రం
ఇది ఇలా ఉండగా ‘ఎన్టీఆర్ బయోపిక్‌’ గురించి మొన్న శుక్రవారం అమరావతి దగ్గర ఉండవల్లిలో జరిగిన టీడీపీ విస్తృత సమావేశంలో ‘మహానటి’ మూవీ ప్రస్తావనతో పాటు ఎన్టీఆర్ బయోపిక్ ప్రస్తావన కూడా వచ్చినట్లు సమాచారం. ఈసమావేశంలో పాల్గొన్న కొంతమంది తెలుగుదేశం నాయకులూ ‘మహానటి’ మూవీ ప్రస్తావన తీసుకువచ్చి ఎన్టీఆర్ బయోపిక్‌ కూడా మహానటి మూవీ స్థాయిలో అందరికీ నచ్చేవిధంగా తీస్తే బాగుంటుంది అని అభిప్రయపడినట్లు టాక్. 
BALAKRISHNA NTR BIOPIC PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనితో అదే సమావేశంలో ఉన్న ప్రముఖ సినీనటుడు రాజమండ్రి పార్లమెంట్ మెంబర్ మురళీమోహన్ కల్పించుకుని తాను ఎన్టీఆర్ బయోపిక్ స్క్రిప్ట్ చదివానని అది చాల బాగుంది అని చెప్పడమే కాకుండా బాలయ్య ఈమూవీని చాల ఏకాగ్రతతో పట్టుదలతో తీస్తున్నాడు అన్న విషయాన్ని వివరించినట్లు టాక్. ఈ న్యూస్ విన్న ఆ సమావేసంలోని తెలుగుదేశం నాయకులు ఈ బయోపిక్ ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తే తెలుగుదేశం పార్టీకి ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయ పడినట్లు తెలుస్తోంది. దీనినిబట్టి చూస్తుంటే తెలుగుదేశం పార్టీ ఇమేజ్ కి కీలకంగా మారిన ఎన్టీఆర్ బయోపిక్ విషయం బాలయ్య పై విపరీతమైన ఒత్తిడి కలిగిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు..   


మరింత సమాచారం తెలుసుకోండి: