స్టార్ సినిమా ఒకప్పుడు 50 కోట్లు దాటితేనే అదో రికార్డ్ అన్నట్టు పరిస్థితి ఉండేది కాని ఇప్పుడు స్టార్ సినిమాల రేంజ్ మారింది. బడ్జెట్టే 50 నుండి 70 కోట్లు పెట్టేస్తున్నారు ఇక వసూళ్ల గురించి మాట్లాడితే రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ ఇయర్ రెండు బ్లాక్ బస్టర్స్ ఏకంగా 200 కోట్ల మార్క్ అందుకున్నాయి.


ఇది సామాన్య విషయం కాదు రంగస్థలం తో రాం చరణ్, భరత్ అనే నేనుతో మహేష్ ఇద్దరు తమ కెరియర్ లో బెస్ట్ హిట్లు గా ఆయా సినిమాలను తీశారు. వీరిని చూసి మిగతా హీరోలు కూడా అదే రేంజ్ రిజల్ట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బాహుబలి బిగినింగ్, కన్ క్లూజన్ రెండు వేల కోట్ల కలక్షన్స్ రాబట్టింది.


అయితే ఆ సినిమా లెక్క వేరు ఎందుకంటే కేవలం తెలుగు మార్కెట్ మీద కాకుండా హింది మిగతా సౌత్ భాషల్లో కూడా ఆ సినిమా వసూళ్లు సాధించింది. అయితే కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ అయ్యి 200 కోట్లు సాధించిన సినిమాలు మాత్రం రంగస్థలం, భరత్ అనే నేను మాత్రమే.


భరత్ కన్నా ముందు రంగస్థలం ఈ ఫీట్ సాధించింది. ఇక రానున్న రోజుల్లో 500 కోట్లను కూడా మన హీరోలు అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. సినిమా హిట్ అయితే కోట్లు ఎలా వచ్చి పడతాయో టాక్ బాగా లేకుంటే అంతకుమించిన లాసులు తెచ్చి పెడుతున్నాయి. అయితే ఇలాంటి టైంలోనే కథల మీద దర్శకుడి మీద కొద్దిగా ఎక్కువ ప్రెజరే ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: