మహేష్ భార్య నమ్రత చరణ్ భార్య ఉపాసన చాల మంచి స్నేహితులు. అదేవిధంగా చరణ్ మహేష్ ల మధ్య మంచి సాన్నిహిత్యం కూడ ఉంది. ఈ రెండు కుటుంబాలు కలిసి గతంలో విదేశాలలో గడిపిన సందర్భాలు కూడ ఉన్నాయి. అలాంటి సాన్నిహిత్యం ఉన్న ఉపాసన ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు మహేష్ అభిమానులకు అసహనాన్ని కలిగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 
BHARATH ANE NENU ALONG WITH RANGASTHALAM MOVIE LATEST POSTERS కోసం చిత్ర ఫలితం
ఈ సమ్మర్ రేస్ కు విడుదలైన ‘రంగస్థలం’ ‘భరత్ అనే నేను’ ఇలా రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో ఈమూవీ కలక్షన్స్ మధ్య పోటీ కూడ అత్యంత తీవ్ర స్థాయిలో జరిగింది. దీనికి తగ్గట్టే చరణ్ మహేష్ లు తమ సినిమాలను చాల పట్టుదలతో ప్రమోట్ చేసారు. ఇప్పుడు ‘రంగస్థలం’ మూవీ కలక్షన్స్ చివరి దశకు చేరుకున్నా ఆవిషయాలను పట్టించుకోకుండా కొన్ని ప్రముఖ ఇంగ్లీష్ ఛానల్స్ ‘రంగస్థలం’ మూవీని ఆకాశానికి ఎత్తేస్తూ రామ్ చరణ్ తో ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు చేయడం వెనుక ఉపాసన హస్తం ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. 
RANGASTHALAM MOVIE POSTERS కోసం చిత్ర ఫలితం
ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ గా పేరుగాంచిన రిపబ్లిక్ టివి ఛానల్ ‘రంగస్థలం’ పై ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రసారం చేయడమే కాకుండా ‘నాన్ బాహుబలి’ సరికొత్త  రికార్డులను క్రియేట్ చేసిన సినిమాగా ‘రంగస్థలం’ ను పేర్కొంటూ ఆసక్తికర కథనాన్ని ప్రసారం చేసింది. అంతేకాదు చరణ్ ‘రంగస్థలం’ రికార్డులను హైలెట్ చేస్తూ మన తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలలో చాల ఖర్చు పెట్టి భారీ హోర్డింగ్స్ పెడుతున్నారు. ఇప్పటికే కలక్షన్స్ చివరి దశకు వచ్చిన ఈమూవీకి ఇప్పుడు పబ్లిసిటీ ఏమిటీ అంటూ అందరు ఆశ్చర్య పడుతున్నారు. 
RANGASTHALAM MOVIE POSTERS కోసం చిత్ర ఫలితం
అయితే మళ్ళీ చరణ్ కు ‘రంగస్థలం’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ వెంటనే వచ్చే అవకాశం కలుగుతుందో లేదో అనే ఆలోచనలతో మరే సినిమా ‘రంగస్థలం’ రికార్డులను ఇప్పట్లో బ్రేక్ చేయలేదు అన్న సంకేతాలు ఇస్తూ ఇలాంటి ప్రచారం చరణ్ టీమ్ తో జరిపించడం వెనుక ఉపాసన హస్తం ఉంది అంటున్నారు. అయితే ఇది అంతా ‘భరత్’ కంటే ‘రంగస్థలం’ గొప్పది అన్న ప్రచారంలో భాగంగా జరుగుతున్న విషయం అంటూ మహేష్ అభిమానులు ఉపాసన పై గుర్రుగా ఉనట్లు సమాచారం..    


మరింత సమాచారం తెలుసుకోండి: