ఎవరూ ఊహించని అనూహ్య విజయం సాధించి కలక్షన్స్ సునామీ సృష్టిస్తున్న ‘మహానటి’ మూవీకి అల్లు అర్జున్ వ్యూహాత్మక సహాయం చేయడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. ‘నాపేరు సూర్య’ ఫ్లాప్ ను కూడ లెక్క చేయకుండా బన్నీ ‘మహానటి’ హిట్ అయినందుకు ఇచ్చిన పార్టీ న్యూస్ పై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. 
ALLUARJUN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇప్పటికే ఈమూవీ దర్శక నిర్మాతలను తన ఇంటికి పిలిచి గౌరవించిన చిరంజీవి పద్ధతిని అనుసరిస్తూ అల్లు అర్జున్ నిన్న ‘మహానటి’ యూనిట్ కు ఒక ప్రముఖ హోటల్ లో ప్రత్యేకమైన పార్టీ ఇచ్చి ఆమూవీకి పనిచేసిన వారందర్నీ పిలవడమే కాకుండా ఇండస్ట్రీలో కొందరు ప్రముఖ వ్యక్తులను తన సన్నిహితులు మరికొందరినీ ఈపార్తీకి పిలిచినట్లుగా వార్తలు వస్తున్నాయి.దీనితో ‘సూర్య’ ఫ్లాప్ ను లెక్క చేయకుండా బన్నీ ‘మహానటి’ విషయమై వ్యవహరిస్తున్న తీరుకు ఇండస్ట్రీలోని చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు. 
సంబంధిత చిత్రం
అయితే బన్నీ ఈపార్టీ ఎందుకు ఇచ్చాడు అంటూ ఇండస్ట్రీలోని కొన్ని వర్గాల వారు రంద్రాన్వేషణ మొదలుపెట్టడమే కాకుండా భవిష్యత్ లో చిరంజీవిలాగే అల్లు అర్జున్ కు కూడ నాగ్ అశ్విన్ తో సినిమాలు చేయాలని ఉందా ? అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా నిన్నటితో వీకెండ్ ముగియడంతో ‘మహానటి’ కలక్షన్స్ కు అసలైన పరీక్ష ఈరోజు నుంచి ప్రారంభం అవుతుంది. 
ALLUARJUN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈ మొదటి సోమవారం పరీక్షను తట్టుకుని ‘మహానటి’ నిలబడగలిగితే మరో 10రోజుల వరకు ఈమూవీ కలక్షన్స్ విషయంలో ఇక వెనక్కు తిరిగి చూసుకునే అవసరం లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికితోడు ఈమూవీకి పోటీ ఇవ్వగల సినిమాలు ఏమి ఈవారం విడుదల కాకపోవడంతో పాటు నాగ శౌర్య అమ్మమ్మగారిల్లు’ పై చెప్పుకోతగ్గ అంచనాలు లేకపోవడంతో ‘మహానటి’ కి ఈవారం కూడ కలక్షన్స్ విషయంలో ఎదురు లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: